టాలీవుడ్ లో సంక్రాంతి టెన్షన్ మొదలైంది. ఈసారి సంక్రాంతి సందర్భంగా పెద్ద హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయి. కొన్నేళ్లుగా ప్రముఖ హీరోల సినిమాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బెనిఫిట్ షో లు.. టికెట్ ధరల పెంపు సాధారణ ప్రక్రియ గా మారింది. కానీ, తాజాగా పుష్ఫ -2 ప్రీమియర్ షో తొక్కిసలాట, మహిళ ప్రాణాలు కోల్పోవటం, తాజా పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వం తమ రాష్ట్రంలో బెనిఫిట్ షో లు.. టికెట్ ధరల పెంపునకు నో చెప్పింది. ఈ రోజు సినీ ప్రముఖుల సమావేశంలోనూ ఈ నిర్ణయంలో మార్పు లేదని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. తెలుగు సినిమాలకు తెలంగాణ పెద్ద మార్కెట్ గా ఉంది. అదేవిధంగా రేవంత్ నిర్ణయంతో ఏపీ ప్రభుత్వం పైన పరోక్షంగా ఒత్తిడి పెరుగుతోంది. ఈ సమయంలో ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ టాలీవుడ్ కు గేమ్ ఛేంజర్ గా కనిపిస్తున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ లతో సమావేశమయ్యేందుకు సినీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 30న అమరావతిలో సమావేశం జరిగే అవకాశం ఉందని సమాచారం. అయితే, రేవంత్ నిర్ణయం తరహాలోనే చంద్రబాబు వ్యవహరించాలని ఇప్పటికే పలు సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి డిమాండ్లు తెర మీదకు వచ్చాయి. దీంతో, సినీ పెద్దలు అప్రమత్తం అయ్యారు. ఏపీ ప్రభుత్వంతో భేటీకి బాలయ్య ను తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో, ఇప్పుడు పవన్ ఏ విధంగా టాలీవుడ్ కు అండగా నిలుస్తారు.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.
ఈ సంక్రాంతికి రామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్', బాలకృష్ణ డాకూ మహారాజ్, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం, సందీప్ కిషన్ మజాకా సినిమాలు రేసులో ఉన్నాయి. గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలకు దిల్ రాజు నిర్మాత. కాగా, 'డాకూ మహారాజ్' మూవీకి నైజాంలో డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నారు. ప్రస్తుతం రేవంత్ తో తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ గా ఉన్న దిల్ రాజ్ జోక్యంతో తాజా సమావేశం జరిగింది. కానీ, అసలు ఫలితం దక్కలేదు. దీంతో.. ఇప్పుడు ఏపీ పైనే ఆశలు పెట్టుకున్నారు. ఆయన ఆశలు ఏమవుతాయో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos