సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో తలెత్తిన కుటుంబ సభ్యుల వివాదం గత వారం రోజులుగా అనేక సంచలనాలు సృష్టిస్తున్న క్రమంలో తాజాగా నేడు మోహన్ బాబు చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో పీఆర్వో చేత తన డబుల్ బ్యారెల్ గన్ ని సరెండర్ చేయించారు. కుటుంబంలో పరస్పరం గొడవలు జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు కేసులు వేసుకునే స్థాయికి వచ్చేసారు. ఈ క్రమం లో క్షణికావేశంలో ఏదైనా జరిగే ప్రమాదం ఉంది. అందుకే పోలీసులు వెంటనే గన్ ని సరెండర్ చెయ్యాలని, లేకపోతే వారెంట్ ని జారీ చేసి అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆయన తన వద్ద ఉన్న డబుల్ బ్యారెల్ గన్ ని పోలీసులకు సరెండర్ చేశారు.
మరోవైపు మోహన్ బాబు అరెస్ట్ అంశంపై హైదరాబాద్ రాచకొండ సీపీ సుధీర్ బాబు కీలక ప్రకటన చేశారు. మంచు కుటుంబంలో వివాదంతో ఇప్పటికే మూడు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశామని, ఈ కేసులపై దర్యాప్తు కొనసాగుతోందని.. మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఆలస్యం లేదన్నారు. ఆయన దగ్గర మెడికల్ రిపోర్ట్ తీసుకోవాలని... మోహన్ బాబుకు నోటీస్ ఇచ్చినట్లు వెల్లడించారు. ఆయన 24వ తేదీ వరకు సమయం కోరారని.. హైకోర్టు కూడా అప్పటి వరకు మినహాయింపు ఇచ్చిందని అన్నారు. ఈ నెల 24వ తేదీ లోపు ఎగ్జామిన్ చేయొచ్చా లేదా అనే అంశాన్ని కోర్టును అడుగుతామన్నారు. మోహన్ బాబుకు మరోసారి నోటీసులు జారీ చేస్తామని.. మోహన్‌బాబు నోటీసులకు స్పందించకపోతే అరెస్ట్ చేస్తామన్నారు సీపీ.
ఇదంతా పక్కన పెడితే నిన్న మంచు మనోజ్ తన అన్నయ్య విష్ణు పై కేసు వేసిన ఘటన మరోసారి సంచలనం గా మారింది. తన ఇంటి జనరేటర్ లో మా అన్నయ్య విష్ణు పంచదార వేసాడని, అందువల్ల మా ఇంటికి విద్యుత్తు సరఫరా ఆగిపోయిందని చెప్పుకొచ్చాడు. దానికి సంబంధించిన సీసీటీవీ కెమెరా వీడియోలను కూడా ఆయన పోలీసులకు సమర్పించాడు. మొత్తానికి మంచు కుటుంబంలో వివాదాలు నానాటికి పెరుగుతున్నాయి తప్ప తగ్గిపోవడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos