మంచు కుటుంబంలో చెలరేగిన వివాదం ఎన్నో నాటకీయ కోణాల్లో మలుపులు తిరుగుతోంది. నిన్న రాత్రి గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో మనోజ్ .. మోహన్ బాబు ఇంటి గేట్లను బద్దలు కొట్టుకొని లోపలకు వెళ్ళిపోయాడు. ఆ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు, మోహన్ బాబు ఆవేశం తో మీడియా రిపోర్ట్స్ పై చెయ్యి చేసుకోవడం వంటివి సంచలనం గా మారాయి. దీనిపై ఇవాళ మంచు మనోజ్ మీడియా తో మాట్లాడుతూ, నిన్న రాత్రి మోహన్ బాబు చేతిలో దాడికి గురైన రిపోర్టర్స్ కు క్షమాపణలు చెప్పాడు. అంతే కాకుండా నిన్న రాత్రి మోహన్ బాబు మనోజ్ పై ఆరోపణలు చేస్తూ ఒక ఆడియో ని విడుదల చేయడంపై మనోజ్ స్పందిస్తూ నాపై మా నాన్నగారు నిందలు వేయడం బాధించిందని.. ఇన్ని రోజులు నేను మౌనంగా ఉన్నానని, ఇక ఉందల్చుకోలేదు.. ఈ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి జరిగిన వాస్తవాలను ఆధారాలతో సహా మీడియా ముందు పెడతానంటూ చెప్పుకొచ్చాడు మంచు మనోజ్.
ఇదంతా పక్కన పెడితే...కాసేపటి క్రితమే మంచు విష్ణు ప్రెస్ మీట్ నిర్వహించి మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి పైన వివరణ ఇస్తూ... మనోజ్ చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించాడు. మా నాన్న నిన్న ఉద్దేశపూర్వకంగా మీడియా ప్రతినిధులపై పై దాడి చేయలేదని... సుమారు 20 మంది మా ఇంటి గేట్లను బద్దలు కొట్టి తోసుకొని లోపలకు వచ్చిన సమయంలో ఉద్రిక్త వాతావరణంలో అలా జరిగిపోయిందని... నిజానికి అలా జరిగి ఉండకూడదని.. ఇది ఒక దురదృష్టకర ఘటన అని ఆన్నారు.
గాయపడిన రిపోర్టర్ కుటుంబంతో టచ్ లో ఉన్నానని.. అతనికి అన్ని విధాలుగా అండగా ఉంటానని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. మా నాన్న ఆడియో రికార్డు వదిలి తప్పు చేసారని, నేను పక్కనే ఉండుంటే అలా జరగనిచ్చే వాడిని కాదని, మా ఇంట్లో గొడవలను నేను మీకు చెప్పదల్చుకోలేదని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos