ఏపీ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ పుష్ప -2 జాతర ఘనంగా రికార్డులు మోత మోగిస్తున్న వేళ ... చిత్తూరు జిల్లా కుప్పంలో ఆ సినిమాను ప్రదర్శిస్తున్న రెండు థియేటర్లను మూసివేయటం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల అయినప్పటి నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖుషీ మూడ్ లో ఉన్నారు. ఓవర్సీస్ లోనూ ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తోంది. ప్రీమియర్ షో లకు అనూహ్య స్పందన కనిపించింది. తొలి రోజే రూ. 294 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తున్న పుష్ఫ చిత్రం రానున్న రోజుల్లో కొత్త రికార్డు క్రియేట్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. అయితే సమయంలో కుప్పంలో పుష్ఫ సినిమాను ప్రదర్శిస్తున్న రెండు థియేటర్లను అధికారులు సీజ్ చేయడం సంచలనం కలిగించింది. అధికారులు సినిమా ప్రదర్శనను అర్ధాంతరంగా నిలిపివేసి మరీ థియేటర్‌కు తాళాలు వేశారు.
ఈ రెండు థియేటర్లు టీడీపీ నేత కు చెందినవిగా చెబుతున్నారు. సీజ్ చేయటం పైన అధికారులు కారణాలు వెల్లడిస్తున్నారు. ఈ థియేటర్లకు అవసరమైన అనుమతి పత్రాలు లేవని... ఈ రెండు థియేటర్ల యాజమాన్యం లైసెన్సు రెన్యూవల్ చేయకపోవడంతో పాటుగా ఎన్‌ఓసీ లేకుండా ప్రదర్శనలు కొనసాగించటం చట్ట విరుద్దమని అధికారులు వివరించారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించే ధియేటర్ల విషయంలో కఠిన చర్యలు తప్పవని వెల్లడించారు. అయితే, పుష్ఫ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే అధికారులు ఈ రకంగా చర్యలు తీసుకోవటం ఏమిటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయం పైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos