అమరావతి రైతులకు ప్రభుత్వం మరో తీపికబురు చెప్పింది. సీఆర్డీఏ రాజధాని ప్రాంతంలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ)ల రుణంతో చేపట్టబోయే పనులకు వరుసగా టెండర్లు పిలుస్తుండగా.. తాజాగా మరో మూడు పనులకు సంబందించి టెండర్లను ఆహ్వానించారు. అమరావతిలోని మూడు జోన్లలో రూ.6,595.50 కోట్లతో ఎల్పీఎస్ లే అవుట్లలో కనీస వసతుల కల్పన కోసం కాంట్రాక్టర్ల నుంచి బిడ్లను ఆహ్వానించారు. టెండర్ల దాఖలుకు ఫిబ్రవరి 4 వరకు తుది గడువు విధించిన క్రమంలో... అదే రోజు సాయంత్రం 4 గంటలకు టెండర్లు తెరవనున్నారు.
రాజధాని ప్రాంతంలోని జోన్- 10లో ఉన్న మందడం, నవులూరు, ఐనవోలు, కృష్ణాయపాలెం, కురగల్లులో విద్యుత్తు, తాగునీరు, గ్రీనరీ డెవలప్‌మెంట్, ఇంటర్నల్ వైర్ల కోసం డక్ట్‌ల నిర్మాణం వంటి వసతుల కల్పన కోసం రూ. 1,487.50 కోట్లు వెచ్చిస్తారు. అంతేకాదు జోన్ - 12 పరిధిలోని నిడమర్రు, కురగల్లు, నవులూరులో రూ. 2,949 కోట్లు.. జోన్ - 12ఏ పరిధిలోని నిడమర్రు, కురగల్లులో రూ. 2,159 కోట్లతో రైతుల రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక వసతులను కల్పించాలని నిర్ణయించారు.
అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు సీఆర్డీయే రిటర్నబుల్ ప్లాట్లు అందజేసిన క్రమంలో... ఈ-లాటరీ నిర్వహించి సీఆర్డీఏ అధికారులు ఈ ప్లాట్లను కేటాయించారు. రైతులకు ఆన్‌లైన్ ర్యాండమ్ సిస్టమ్ ద్వారా నివాస, కమర్షియల్ ప్లాట్లకు లాటరీ ఉంటుంది. ఈ-లాటరీలో ప్లాట్లు పొందిన రైతులకు .. వాటిని ఎక్కడ కేటాయించారో తెలిపేందుకు అవసరమైన సిబ్బందిని కూడా సీఆర్డీఏ నియమించింది. ఇలా రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం.. అమరావతిలో ప్రభుత్వం తొమ్మిది రిజిస్ట్రేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా వివరించారు
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos