అమరావతి : ఏపీ ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ గా నేడు లంకా దినకర్ బాధ్యతలు స్వకరించారు. ఈ సందర్బంగా లంక దినకర్ మాట్లాడుతూ.. ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ గా బిజెపి కేంద్ర పార్టీ పెద్దల సమన్వయంతో అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మరియు రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కి ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదంతో రాష్ట్రంలో “ స్వర్ణాంధ్ర 2047 సాధన సూత్రాలు “ గా ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు. వికసిత భారత్ ప్రధాని మోడీ గారి లక్ష్యం - స్వర్ణాంధ్రతో వికసిత ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. నీతి అయోగ్ సూచించిన సమ్మిళిత అభివృద్ధి ఇండికేటర్లతో ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలను అనుసంధానం చేయడం జరుగుతుందని అన్నారు. ప్రధాని మోడీ కల ఆర్థిక, రాజకీయ మరియు సామాజిక మహిళ సాధికారత - లాక్ పతి దీదీలుగా, చట్ట సభలలో ⅓ వ వంతు ప్రాతినిధ్యం. సీఎం చంద్రబాబు కల ప్రతి ఒక్కరికి గౌరవప్రదమైన ఆదాయ వ్యాపకంతో పేదరికం లేని సమాజం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కల జల్ జీవన్ మిషన్ తో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత మంచి నీరు మరియు గ్రామ పంచాయితీల సాధికారత. విద్య మరియు ఐటీ శాఖామంత్రి నారా లోకేష్ కల “ నైపుణ్య గణన “ ద్వారా యువతకు సరైన స్థానంలో ఉపాధి మరియు మానవ వనరుల అభివృద్ధి. రైతు శ్రేయస్సు కోసం డబుల్ ఇంజన్ సర్కార్ పంటకు కనీస మద్దతు ధర పెంచింది. అలాగే ఫసల్ భీమా యోజన ద్వారా రైతులకు నష్టపరిహారం చేయడం జరుగుతుందన్నారు.
పేద మధ్యతరగతి ప్రజలకు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన క్రింద రాష్ట్రంలో 2.67 కోట్ల మందికి ఉచిత ఆహారం, పీఎంఏవై క్రింద గృహలు 25 లక్షల్ గృహాలు, పీఎం సూర్యఘర్ క్రింద సబ్సిడీ పైన సోలార్ పవర్ తదితర పథకాలను అంత్యోదయ స్పూర్తితో రాష్ట్రంలో అందుతున్నాయి. ఇప్పటికే పీఎంఏవై, జల్ జీవన్ మిషన్, ఉపాధి హామీ నిధులు, ఎస్సీ, ఎస్టీ మరియు వెనుకబడిన వర్గాల నిధుల వినియోగం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, బీపీఎల్ కుటుంబాల సంఖ్య కోసం తదితర శాఖల సమీక్ష కోసం అవసరమైన సమాచారం సిద్ధం చేయమని అధికారులను కోరామని తెలిపారు. స్వర్ణాంధ్ర సాధన దిశగా రాష్ట్ర స్థాయిలో వివిధ శాఖల సమీక్షల అనంతరం జిల్లా స్థాయి సమీక్షలు నిర్వహిస్తామన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాల సద్వినియోగం, రాష్ట్రం నుండి సరైన మ్యాచింగ్ గ్రాంట్ల ద్వారా ఆ పథకాల లక్ష్యాలను సాధించి స్వర్ణాంధ్ర సాధిస్తాం అని.. స్వర్ణాంధ్ర స్వప్నం సాకారం అయ్యె విధంగా ఆంధ్రప్రదేశ్ ను ప్రధాని మోదీ సహకారం, సీఎం చంద్రబాబు సారథ్యంలో 2.40 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడానికి నాకు ఇచ్చిన బాధ్యతలు వినియోగిస్తాను స్పష్టం చేసారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos