నిను వీడని నీడను నేను అన్నట్లుగా వర్షాలు తెలుగు రాష్ట్రాలపై పగ బట్టినట్లే కనిపిస్తున్నాయి. గడిచిన కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఇంకా తెలుగు రాష్ట్రాలు తేరుకొనే లేదు..అప్పుడే వాతావరణ శాఖ మరో బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఈ రోజు నుంచి మరో నాలుగు రోజులు ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, గురువారం నాటికి అల్పపీడనంగా మారుతుందని దాని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలోని ములుగు, జయశంకర్ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, ఆసిఫాబాద్ , ఖమ్మం,నాగర్ కర్నూల్ , కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అలర్ట్ గా ఉండాలని అధికారులు ఆదేశించారు. ఏపీలోనూ జోరుగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. విశాఖ, అల్లూరి సీతారామరాజు, నంద్యాల, ఉభయ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలోపాటు విజయవాడలో వర్షాలు కురుస్తాయని తెలిపింది.ఇప్పుడిప్పుడే వరద నుండి బయటపడుతున్న విజయవాడ పరిసర ప్రాంతాలకు ఈ రెయిన్ అలర్ట్ మరింత భయానికి గురి చేస్తుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos