టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో గత కొంత కాలంగా వివాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఇద్దరు కుమారులు మంచు విష్ణు- మంచు మనోజ్ మధ్య హాస్టల్ వ్యవహారంలో గొడవలు జరుగుతున్నాయి.  ఈ నేపథ్యంలో మోహన్ బాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆస్తుల వ్యవహారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వద్దకు చేరింది.

హైదరాబాద్ శివారు జల్‌పల్లి నివాసాన్ని తనకు స్వాధీనం చేయాలని మోహన్ బాబు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తన నివాసంలో కొందరు అక్రమంగా ఉంటున్నారని.. వెంటనే ఖాళీ చేయించాలన్నారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రచారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని ఫిర్యాదులో కోరారు. ప్రస్తుతం జల్‌పల్లిలోని నివాసంలో మంచు మనోజ్ తన భార్య భూమా మౌనిక రెడ్డి, తన పిల్లలతో ఉంటున్నట్లు తెలిసింది. మంచు మనోజ్ ఫిర్యాదుపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ స్పందించారు. ఈ మేరకు మంచు మనోజ్‌కు నోటీసులు జారీ చేశారు.

మనోజ్ జల్లపల్లిలోని నివాసంలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తన ఆస్తిని స్వాధీనం చేసి ఇవ్వాలని.. మోహన్ బాబు కలెక్టర్‌ను ఆశ్రయించారు. దీంతో కలెక్టర్ మనోజ్‌కు నోటీసులు జారీ చేశారు. ఆస్తుల స్వాధీనానికి పోలీసులను ఆదేశించారు.ఇదిలా ఉండగా.. మంచు బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం మరింత పెరుగుతోంది. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ట్రోలింగ్ చేసుకుంటున్నారు.  మహిళలు, నాన్న, స్టాఫ్‌ను పక్కన పెట్టి మనం కలుద్దాం. ఒట్టేసి చెబుతున్నా.. నేనొక్కడినే వస్తా. నువ్వు ఎవరినైనా, ఎంతమందినైనా తీసుకొచ్చుకో. లేకపోతే మనం హెల్తీ ఓపెన్ డిబేట్ పెట్టుకుందాం' అని మనోజ్ ట్వీట్ చేశారు.

Related Videos