సెప్టెంబర్ 1.. అంటే ఈ రోజే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి జీవింతలో మరపురాని రోజు. 1995లో ఆయన ఇదే రోజు(సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మొదటి సారి ముఖ్యమంత్రి అయ్యారు. 1995 సెప్టెంబర్ 1న కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన సీఎం అయ్యారు.. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా కూడా నిలిచారు. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి సెప్టెంబర్ 1తో 30 ఏళ్లు కానుండటంతో.. సమాజానికి ఆయన చేసిన సేవలను ప్రజలకు తెలియజేసేందుకు టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర చరిత్రలోనే గొప్ప మలుపు. ఉమ్మడి రాష్ట్రంలో, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ ప్రజల మనస్సులో చెరగి ముద్ర వేశాయి. చంద్రబాబు విజన్-2020 ప్రణాళికను చాలామంది నాయకులు ఎగతాళి చేశారు కానీ... ఇప్పుడదే నిజమై కళ్ల ముందు కనిపిస్తోంది.
చంద్రబాబు తెలుగు రాష్ట్రాల్లో ఓ బ్రాండ్. దేశ వ్యాప్తంగా సుపరిచితం. ఎన్డీఏ1లో క్రియాశీల పాత్రధారి, సూత్రధారి. దార్శనికత, ముందుచూపునకు పెట్టింది పేరు. ఆయన ఒక ఆలోచన చేశారంటే.. అది రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడేదిగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఐటీ రంగం ఇంతలా అభివృద్ధి చెందడం వెనుక చంద్రబాబు మాస్టర్ బ్రెయిన్ దాగి ఉందంటారు. ఇక రాజకీయాల్లో గెలుపోటములు సహజం. రాజకీయమనే వైకుంఠపాళిలో నిచ్చెనలూ ఎక్కారు.. పాముల నోట్లోనూ పడి అథ:పాతాళానికి చేరుకున్నారు. కానీ వెరవలేదు.. వెన్నుచూపలేదు. మళ్లీ మళ్లీ నిలబడ్డారు. విజయం సాధించారు.
తెలుగురాష్ట్రాలతో పాటు.. భారతదేశంలో అత్యంత సీనియర్ నేతల్లో చంద్రబాబు ఒకరు. దాదాపు 15 ఏళ్లు అధికార పక్షం.. మరో 20 ఏళ్లు ప్రతిపక్షంలో ఆయన కీలకభూమిక పోషించారు. ప్రతి క్షణాన్ని.. ప్రతి రోజును సద్వినియోగం చేసుకున్నవారే చరిత్రలో నిలిచిపోతారు. అలాంటి నేతల్లో చంద్రబాబు ఒకరని చెప్పవచ్చు. 46 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం ఆయనది. 28 ఏళ్లకే ఉమ్మడి ఏపీ వంటి రాష్ట్రానికి మంత్రి అయ్యారు. రాజకీయ జీవితానికి వస్తే చంద్రబాబు చెరగని ముద్ర వేశారు.
ఉమ్మడి ఏపీకి సీఎంగా రెండుసార్లు వరుసగా పనిచేసిన ఆయన.. దాదాపు దశాబ్దన్నర పాటు సీఎంగా సేవలు అందించారు. ఉమ్మడి ఏపీకి 1995-2004 సీఎంగా వ్యవహరించారు. అంటే.. దాదాపు 9 సంవత్సరాల 3 నెలలు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014-19 మధ్య పూర్తికాలం విభజిత ఏపీకి సీఎంగా వ్యవహరించారు. ప్రస్తుతం రెండోసారి 2024 జూన్ నుంచి ఏపీకి సీఎంగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ దక్కని రికార్డుగా చెప్పుకోవచ్చు. గతంలో చంద్రబాబు నాయుడుతో పని చేసిన పార్టీ మారిన సీనియర్లు కూడా చంద్రబాబు నాయుడు విజన్ డిఫరెంట్ గా ఉంటుందని, కేంద్రంలో ప్రధానులను సైతం గతంలో నిర్ణయించిన నేతగా ఆయనకు పేరుంది.
అధికారంలో ఉండి సీఎంగా మాత్రమే కాదు, ఇక ప్రతిపక్ష నేతగానూ చంద్రబాబు ఘనత సాధించారు. 1989-94, 2004-14, 2019-24... ఇలా 20 ఏళ్లకు పైగా ఆయన ప్రతిపక్ష నేతగా లేదా ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడిగా ఉన్నారు. సీఎంగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్న చంద్రబాబు, ప్రతిపక్షనేతగా సైతం సుదీర్ఘంగా కొనసాగిన అరుదైన నేతల్లో ఒకరు. తొలిసారిగా సెప్టెంబరు 1న చంద్రబాబుకు మరుపురాని రోజు. 1995లో ఇదే రోజున ఉమ్మడి ఏపీకి చంద్రబాబు సీఎం అయ్యారు. మామ అయిన ఎన్టీఆర్ తో విభేదించి.. పార్టీ ఎమ్మెల్యేల బలంతో చంద్రబాబు తొలిసారి అధికారం చేపట్టారు. అలా 1995 సెప్టెంబరు 1న ఆయన ఉమ్మడి ఏపీకి తొలిసారి సీఎం అయ్యారు. 1999 ఎన్నికల్లో గెలిచి మరోసారి సీఎం అయ్యారు. అయితే, 2004, 2009 రెండు వరుస అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.
విభజిత ఏపీకి 2014లో తొలి సీఎంగానూ ఎన్నికై ప్రత్యేకత చాటుకున్నారు. కాగా, 1995లో చంద్రబాబు తన మామ ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడిని చేయడంపై అనేక విమర్శలున్నాయి. ప్రతిపక్షాలు ఏవేవో విమర్శలు చేస్తుండగా. .. టీడీపీ మద్దతుదారులు మాత్రం పార్టీని రక్షించుకునేందుకు ఇంతకు మించిన మార్గం లేదని సమర్థిస్తుంటాయి.
కాగా చంద్రబాబు ఉమ్మడి ఏపీకి తొలిసారి సీఎం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు నిర్వహిస్తున్నట్లు
మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, టీడీపీ వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు తెలిపారు. ఈ ఉత్సవాల్లో నేతలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రజలు వారు కోరారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos