తిరుపతి తొక్కిసలాట ఘటనతో డాకు మహారాజ్ టీం ఓ నిర్ణయం తీసుకుంది. అనంతపురంలో ఇవాళ జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను డాకు మహారాజ్ టీం క్యాన్సిల్ చేసుకుంది. ఈ మేరకు డాకు టీం ఓ ప్రకటన విడుదల చేసింది. బాలయ్య  ఈ ఘటన మీద స్పందిస్తూ... తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన సంఘటన అత్యంత బాధాకరమని అన్నారు. మృతులకు నా నివాళి. వారి కుటుంబ సభ్యులకు నాప్రగాఢ సానుభూతి. ఈ విషాదకర సందర్భంలో అనంతపురంలో జరగాల్సిన..డాకు మహారాజ్ ప్రీ ఈవెంట్ జరపడం సముచితం కాదనే ఉద్దేశంతో దానిని రద్దు చేశామని బాలకృష్ణ రియాక్ట్ అయ్యారు. 

కాగా డీఎస్పీ అత్యుత్సాహం వల్లే ఈ ఘటన జరిగిందని అంటున్నారు. ఇలాంటి దుర్ఘటన జరిగి అందరూ బాధల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో... తాము ఈవెంట్ చేసుకోవడం సముచితం కాదంటూ డాకు మహారాజ్ టీం ఈ ఈవెంట్‌ను క్యాన్సిల్ చేసుకుంది. ఈ చిత్రం జనవరి 12న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఈవెంట్ కోసం నారా లోకేష్ కూడా రావాల్సింది. కానీ తిరుపతిలో దుర్ఘటన చోటు చేసుకోవడంతో ఈవెంట్‌నే పూర్తిగా రద్దు చేశారు. కాగా రేపటి నుంచి సినీ అభిమానులకు సంక్రాంతి హోరు మొదలైనట్టే. ఈ హోరు రామ్ చరణ్ గేమ్ చేంజర్ మొదలు పెట్టబోతోంది. జనవరి 10న అంటే రేపే గేమ్ చేంజర్ భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.

Related Videos