టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో జరిగిన వివాదాలు గత కొన్ని రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే డిసెంబర్ లో మోహన్ బాబు నివాసం వద్ద గొడవ జరగ్గా.. రిపోర్టింగ్ కోసం వెళ్లిన ఓ ఛానల్ రిపోర్టర్ పై మోహన్ బాబు దాడి చేశారు. అయితే ఈ దాడిలో గాయపడ్డ జర్నలిస్ట్ ఆస్పత్రి పాలు కావడంతో మోహన్ బాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. దీంతో పోలీసులు అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. 

ఆ రిపోర్టర్ మోహన్ బాబు పై కేసు పెట్టడంతో తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ కొరగా కోర్టు అందుకు నిరాకరించింది. దీంతో సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసారు మోహన్ బాబు.ఈ కేసు పై సుప్రీంకోర్టు తదుపరి విచారణ వరకు మోహన్ బాబు పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని తీర్పునిస్తూ గతంలో ఆదేశాలు జారీ చేసింది. అలాగే నాలుగు వారాలకు కేసు వాయిదా వేసిన సుప్రీంకోర్టు నేడు ఈ కేసులో తాజాగా తీర్పును వెలువరించింది. దీంతో మోహన్ బాబుకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించినట్లయింది. 

కాగా తాను దాడి చేసిన ఘటనలో గాయపడిన జర్నలిస్ట్ రంజిత్ ను మోహన్ బాబు ఆస్పత్రిలో పరామర్శించి.. క్షమాపణలు చెప్పారు. అలాగే రంజిత్ కు అండగా ఉంటానని హామీ కూడా ఇచ్చారు, అనంతరం పోలీసులు మంచు కుటుంబ సభ్యులను పిలిచి మరోసారి ఇలా గొడవలకు దిగవద్దని చెప్పారు. అయినప్పటికీ ఏదో ఒక విషయంలో మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతూనే ఉన్నాయని తెలుస్తోంది. ఏది ఏమైనా మోహన్ బాబుకు సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్ లభించడంపై ఆయన అభిమానులు, కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related Videos