ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ముఖ్యమైన తీర్మానాలపై చర్చించి ఆమోదం తెలిపారు. ప్రధానంగా ప్రభుత్వ పథకాలతో పాటుగా.. కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. రాజధాని పరిధిలో వివిధ సంస్థలకు భూకేటాయింపులు.. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఆమోదం తెలిపారు. ఏపీ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేర్చడం, ఏపీ పునర్విభజన చట్టంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనపై చర్చించి ఆమోదించారు. కేబినెట్ ఆమోదం తర్వాత తీర్మానాన్ని కేంద్రానికి పంపే అవకాశం ఉంది. దేశ సరిహద్దులో యుద్ధ వాతావరణం, తీరప్రాంత భద్రత, రక్షణ రంగ పరిశ్రమల వద్ద జాగ్రత్తలు వంటి అంశాలపై మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించారు. ఆపరేషన్‌ సిందూర్‌ నిర్వహించిన త్రివిధ దళాలకు కేబినెట్ అభినందనలు తెలిపింది. అలాగే ఏపీలో పర్యాటక అభివృద్ధికి మెగా ఈవెంట్స్‌ నిర్వహించే అంశంపై నిర్ణయం తీసుకున్నారు.

మున్సిపల్‌ శాఖ 281 పనులను హైబ్రిడ్‌ యాన్యూటీ విధానంలో చేపట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లేబర్ అండ్ ఇండస్ట్రీస్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి 2019లో గత ప్రభుత్వం ఆమోదించి.. కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్న 3 బిల్లులను వెనక్కి తీసుకునే అంశంపై నిర్ణయం తీసుకున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రివర్గం ధన్యవాదాలు తెలపింది. 47వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. రాజధాని అమరావతిని ఫ్రీ జోన్‌గా చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ కోరినట్లు తెలుస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Take Oath As A TDP National Working President | CM Chandrababu | AG

తాజా వార్తలు

17-37-49-0649.jpg

రాజ్యసభ జనసేన పార్టీ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
2026-06-06 Time: 05:37:49

17-10-05-0605.jpg

రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేస్తా.. నామినేషన్ దాఖలు అనంతరం మీడియాతో లింగమనేని రమేష్ 
2026-06-06 Time: 05:10:05

14-47-28-0628.jpg

శ్రీసిటీలో రైల్వే ట్రాక్ రోలింగ్ మిల్లు ఏర్పాటు చేయండి.. నోవోస్టల్ ఎం చైర్మన్ ఇవాన్ డెమ్చెంకో కు  మంత్రి నారా లోకేష్ విజ్ఞ‌ప్తి
2026-06-04 Time: 02:47:28

17-11-24-0624.jpg

పోర్టు ఆధారిత కెమికల్ లాజిస్టిక్స్ హబ్ ల నిర్మాణంలో భాగస్వామ్యం వహించండి.. రస్ కెమ్ గ్రూప్ డిప్యూటీ సిఇఓ ఇల్యా కోసిహ్ తో మంత్రి లోకేష్ భేటీ
2026-06-03 Time: 05:11:24

17-08-34-0634.jpg

హెల్తీ సిటిజన్స్‌తోనే వెల్తీ నేషన్ నిర్మాణం.. లలితా పీవీఎస్ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు 
2026-06-03 Time: 05:08:34

Related Videos