కల్తీ రాయుళ్లకు ఇప్పుడు చాలా ధైర్యం వచ్చి ఉంటుంది. ఇక నుంచి ఎవరైనా కల్తీని నిరూపించడం అసాధ్యమనే భావన లోకి వచ్చినట్లు కనిపిస్తున్నారు. కల్తీ పదార్థాలు పట్టుకున్నా.. అవి కిచెన్ లో ఉన్నాయి కానీ వాడారనడానికి ఎలాంటి ఆధారాలు ఉండవు కాబట్టి… ఒక వేళ వాడినా వాటిని కస్టమర్లకు సప్లయ్ చేశారన్న దానికి ఫ్రూఫ్స్ ఉండవు కాబట్టి.. ఇక ధైర్యంగా తమ దందాను తాము కొనసాగించుకోవడానికి అవకాశం వచ్చిందనే తమ వాదన బలంగా వినిపించుకునే అవకాశం కనిపిస్తోంది. ఇదంతా ఎందుకు ప్రస్తావించాల్సి వస్తోందంటే అత్యున్నత న్యాయస్థానంలో పిటిషనర్ల తరఫున న్యాయవాదులు కల్తీ నెయ్యిపై ఎలా అడ్డగోలుగా భావిస్తున్నారనే అంశం సర్వత్రా చర్చకు వస్తోంది.
తిరుమలలో నెయ్యి తయారీకి వినియోగించే నెయ్యి ట్యాంకర్లు కల్తీ అయినవే అయినా వాటిని వాడలేదు కాబట్టి… లడ్డూ కల్తీ కాలేదన్న వాదన వినిపిస్తున్నారు. లడ్డూలు టెస్టులు చేయించలేదు కాబట్టి కల్తీ కాలేదని తేల్చేస్తున్నారు. మరి ఏఆర్ డెయిరీ పంపిన .. వాడేసిన ట్యాంకర్ల సంగతేంటి... వాడేశారు కాబట్టి వాటిలో కల్తీ లేదని మనం అనుకోవాలి. ఆ లడ్లు తిన్న ఎవరికీ ఏమీ కాలేదు కాబట్టి బాగుందని అనుకోవాలి. విచిత్రమైన వాదనల్ని వినిపించి వ్యవస్థలపై నమ్మకాన్ని తగ్గించేలా చేయడంలో వైసీపీ నేతలకంటే తెలివైన వాళ్లు ఎవరూ ఉండరనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
దొంగలకు తమ పని తాము సమర్థించుకోవడానికి సవాలక్ష మార్గాలుంటాయి. చివరికి ఏ మార్గం లేకపోతే.. ఫ్యామిలీని మొత్తం చంపేసిన కేసుల్లో కూడా తాను అనాథనని ఏడ్చి .. క్షమాభిక్ష పొందగల నైపుణ్యం ఉన్న వారు మన చుట్టూ ఉన్నారు. అందుకే ఒక్కరి తప్పు నిరూపించడం సాధ్యం కావడం లేదు. ఎన్ని హైప్రొఫైల్ కేసులు ఉన్నా.. సాక్ష్యాలు కళ్ల ముందు ఉన్నా.. ఎవరికీ శిక్షపడటం లేదు. పలుకుబడి ఉన్న నేరస్తులు హాయిగా తిరిగేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి కల్తీ నెయ్యి వివాదం కేసులో సుప్రీం కోర్టు వెల్లడించిన అభిప్రాయాలపై వైసీపీ నేతలు చేస్తున్న హడావుడి పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos