మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసిన వైసీపీ నేతలకు రాజకీయాలు చేయడానికి ఎలాంటి అంశాలు లేవనట్లుగా చెత్త రాజకీయాలు చేస్తున్నారు. చివరకు ఏడుకొండలస్వామిని కూడా రాజకీయాల్లోకి లాగి అపచారం చేశారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ తో చేయని రాజకీయం లేదు, అధికారంలో ఉన్నంత కాలం ఏం జరిగినా సైలెంట్ గా ఉండటమే కాదు భూములమ్ముకోవాలని కూడా సలహాలు ఇచ్చారు. అధికారం పోయిన దగ్గర నుంచి మాత్రం ప్రతి రోజు ఇదిగో అమ్మేశారు.. అదిగో అమ్మేశారు అని గగ్గోలు పెడుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఇప్పుడల్లా ముందడుగు వేసే అవకాశం లేదని కేంద్రం చెబుతూనే ఉన్నా.. ఆ ప్రచారాలు మాత్రం ఆగడం లేదు.

తాజాగా కేంద్రం… స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో .. రాష్ట్రీయ నిస్పాత్ నిగమ్ లిమిటెడ్ ను విలీనం చేయాలని నిర్ణయించుకుంది అనే ప్రచారం జరుగుతోంది. ఈ దిశగా కొన్ని చర్యలు కూడా తీసుకున్నారు. ఇది వైసీపీకి బాగా ఇబ్బందికరంగా ఉంది. ఇలా విలీనం చేస్తే .. తమకు రాజకీయం చేయడానికి సరుకేమీ ఉండదని.. విలీనం కాదు అమ్మకం అంటూ… కొత్త కొత్త ధీరీలతో వస్తున్నారు. వారి మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలో కానీ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదన్న అభిప్రాయం మాత్రం ప్రజల్లో ఏర్పడింది.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు అసలు సంస్థను కాపాడుకోవడం పెద్ద సమస్యగా మారిందనేది నిపుణుల అభిప్రాయం. కనీసం ప్రొడక్షన్‌కు కూడా నిధులు లేకపోతే కేంద్రం ఇస్తోంది. కానీ ఎంత కాలమని ఇస్తుంది. ఇలాంటి సమస్యలన్నింటికీ సెయిల్ నుంచి పరిష్కారం లభించవచ్చని రాజకీయ నిపుణులు అంటున్నారు. రెండు, మూడు నెలల్లో స్టీల్ ప్లాంట్ సమస్యకు ముగింపు వస్తుందని వారు అంచనా వేస్తున్నారు.

Related Videos