మహారాష్ట్ర సీఎం పీఠంపై ఉత్కంఠ వీడింది. ఆ రాష్ట్ర తదుపరి సీఎంగా దేవేంద్ర ఫడణవీస్‌ పేరును బీజేపీ అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఎమ్మెల్యేలతో జరిగే సమావేశంలో ఫడణవీస్‌ను బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటారని ఆ పార్టీ సీనియర్ నేత వెల్లడించారు. కాగా, సీఎం ఎంపిక విషయంలో మహాయుతిలో గత కొద్ది రోజులుగా ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే.

ముందు నుంచీ మహారాష్ట్ర బీజేపీలో కీలకంగా ఉన్న ఫడ్నవీస్ పేరే సీఎం రేసులో ప్రముఖంగా వినిపించింది. ఎట్టకేలకు ఫడణవీస్‌ను సీఎంగా నిర్ణయించిన బీజేపీ ఏ క్షణంలోనైనా దీనిపై అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

అటు, మహాయుతి కూటమిలో కీలకంగా వ్యవహరించిన ఏక్‌నాథ్ షిండే (శివసేన) సీఎం రేసులో ఉన్నట్లు వార్తలొచ్చాయి. అయితే, దీనిపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కూటమిలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని.. బీజేపీ, శివసేన, ఎన్సీపీ కలిసి ఏకాభిప్రాయానికి రానున్నట్లు షిండే తెలిపారు. అమిత్ షాతో భేటీ అనంతరం షిండే మెత్తబడినట్లు తెలుస్తోంది. అయితే, కీలక మంత్రిత్వ శాఖలను ఆయన ఆశిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 5 మధ్యాహ్నం 1 గంటకు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos