మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ఫలితాలు విడుదలై పది రోజులు గడిచినా.. ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్షన్ కొససాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఎట్టకేలకు ముఖ్యమంత్రి ఎవరనే దానిపై స్పష్టత వచ్చింది. మహారాష్ట్ర సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర పఢ్నవీస్ పేరు ఖరారైంది. బుధవారం జరిగిన బీజేపీఎల్పీ సమావేశంలో శాసనసభపక్ష నేతగా ఫడ్నవీస్‌ను ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. సీఎం పదవి విషయంలో ఏక్‌నాథ్ షిండే బెట్టు వీడటంతో ఫడ్నవీస్‌కు మార్గం సుగమం అయ్యింది.

మహారాష్ట్ర పరిశీలకులుగా వచ్చిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ సమక్షంలో ఎల్పీనేతగా ఫడ్నవీస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఫడ్నవీస్‌కు నిర్మలా సీతారామన్ అభినందనలు తెలిపారు. ఫడ్నవీస్ నాయకత్వంలో మహారాష్ట్ర భవిష్యత్తు మారనుందని, ప్రజల నమ్మకాన్ని ఆయన నిలబెడతారని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని అన్నారు. అంతేకాదు, మహారాష్ట్ర అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

మహాయుతి కూటమి భారీ విజయం సాధించినా.. సీఎంగా ఎవరు ఉండాలనే విషయంలో మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రమాణ స్వీకారం ఆలస్యమైందనే ప్రచారం జరిగింది. ఎన్సీపీ (అజిత్ పవార్) సీఎం పదవి డిమాండ్ చేయకపోయినా, శివసేన (షిండే) మాత్రం తమకు ముఖ్యమంత్రి పదవి కావాలని చివరి వరకు డిమాండ్ చేస్తూ వచ్చింది. సీఎం పదవి ఇవ్వకపోతే తాము కోరుకున్న మంత్రిత్వశాఖలను ఇవ్వాలని అడిగినప్పటికీ షిండే డిమాండ్ల పట్ల బీజేపీ సానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది.

బీజేపీ అధిష్టానం షిండేను ఒప్పించినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గురువారం మధ్యాహ్నం ముంబయిలోని ఆజాద్ మైదానంలో సీఎంతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. గతవారం ఢిల్లీలో బీజేపీ నేతలతో సమావేశం అనంతరం ముంబయి చేరుకున్న ఏక్‌నాథ్ షిండే.. తన స్వస్థలానికి వెళ్లిపోవడం మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగింది. ఆయన అనారోగ్యానికి గురైనట్టు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో సోమవారం థానేలోని ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ఆయన ఫడ్నవీస్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం పదవి విషయంలో షిండే వెనక్కి తగ్గి.. ఫడ్నవీస్‌కు మద్దతు తెలిపినట్టు తెలుస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos