డెస్క్ : మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి రోజులు గడుస్తున్నప్పటికీ ఇంకా ముఖ్యమంత్రి ఎవరనేది తేలట్లేదు. ముఖ్యమంత్రి పీఠంపై పీటముడి పడింది. ప్రతిష్ఠంభన కొనసాగుతూనే వస్తోంది. మహారాష్ట్రతో పాటే ఎన్నికలను ఎదుర్కొన్న జార్ఖండ్‌లో గురువారం కొత్త ప్రభుత్వం ఏర్పడవబోతున్నప్పటికీ ఇక్కడ మాత్రం జాప్యం జరుగుతోంది. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో  భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం నాన్చుడు ధోరణిని ప్రదర్శిస్తోంది. వరుసగా రెండోసారి ఏక్‌నాథ్ షిండేకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలంటూ శివసేన పట్టుబట్టడం దీనికి ప్రధాన కారణం.

సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 145 సీట్ల సంఖ్యా బలం బీజేపీకి లేదు. 149 సీట్లల్లో పోటీ చేసి 132 చోట్ల గెలిచిందీ పార్టీ. షిండే వర్గం శివసేన 81 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టగా 57 మంది గెలుపొందారు. అజిత్ వర్గానికి చెందిన ఎన్సీపీ మొత్తం 59 స్థానాల్లో పోటీ చేయగా 41 సీట్లు ఈ పార్టీ ఖాతాలో పడ్డాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మిత్రపార్టీల మద్దతు తప్పనిసరి కావడంతో ముఖ్యమంత్రి పదవి కోసం శివసేన భీష్మించింది. శివసేన మహిళా అధికార ప్రతినిధి శీతల్ మ్హాత్రే ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రకటన విడుదల చేశారు. మహారాష్ట్ర ఓటర్లు, పార్టీ క్యాడర్ మొత్తం కూడా షిండే నాయకత్వాన్ని కోరుకుంటోందని స్పష్టం చేశారు.

దీంతో ముఖ్యమంత్రిగా ఎవరిని ప్రకటించాలనే విషయం మీద ప్రతిష్ఠంభన నెలకొంది. బీజేపీ అధిష్ఠానం మాత్రం ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ వైపే మొగ్గు చూపుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ దఫా సీఎం పదవి తమ పార్టీకే దక్కాలనే పట్టుదలతో ఉంది. ఇదే విషయాన్ని శివసేనకూ తేల్చి చెప్పింది. కొత్త మంత్రివర్గ కూర్పు ఎలా ఉండాలనే విషయంపైనా ఓ స్పష్టత ఉంది బీజేపీలో. 21 బెర్తులను తీసుకోనున్నారు కమలనాథులు. శివసేనకు 12, అజిత్ పవార్ ఎన్సీపీకి 10 పోర్ట్‌ఫోలియోలను కేటాయించాలని బీజేపీ నిర్ణయించింది కూడా. దీనికి కూడా అంగీకరించట్లేదు శివసేన.

తక్కువ సీట్లే ఉన్నప్పటికీ- బిహార్‌లో జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీష్ కుమార్‌ను ముఖ్యమంత్రిగా కొనసాగిస్తున్న ఫార్ములాను ఇక్కడా అమలు చేయడానికి బీజేపీ ససేమిరా అంటోంది. అలాంటి ఆలోచనే చేయట్లేదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రేమ్ శుక్లా కుండబద్దలు కొట్టారు. మొత్తానికి మహారాష్ట్ర సీఎం అభ్యర్థి ఇప్పటికీ ఎవరు కీలకపోవడంతో ఆ రాష్ట్ర ప్రజల్లోనే కాకుండా రాజకీయంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

యూట్యూబ్ లైవ్

LIVE : పెన్షన్ల పంపిణీ..CM Chandrababu Pension Distribution @ Palnadu | NTR Bharosa | Amaravati Gala

తాజా వార్తలు

19-43-09-0109.jpg

స్మోక్ ఫ్రీ సిగరెట్ తయారీ యూనిట్ కు గుంటూరు, ప్రకాశం జిల్లాలు అనుకూలం.. ఫిలిప్ మోరిస్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రియా గోంట్కోవికోవాతో లోకేష్ భేటీ
2025-01-21 Time: 07:43:09

17-55-03-0103.jpg

ఏపీలో జడ్ఎఫ్ ఫాక్స్ కాన్ వాహన తయారీ యూనిట్ నెలకొల్పండి..! సిఇఓ ఐకీ డోర్ఫ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ
2025-01-21 Time: 05:55:03

17-52-33-0133.jpg

ఇక ఆ విషయంపై మాట్లాడొద్దు - జనసేన శ్రేణులకు హైకమాండ్ కీలక ఆదేశాలు..!
2025-01-21 Time: 05:52:33

16-43-36-0136.jpg

దావోస్ లో సిస్కో వైస్ చైర్మన్ ప్రాన్సిస్ కట్సౌదాస్ తో మంత్రి లోకేష్ భేటీ.. ఏపీలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని విజ్ఞప్తి..!
2025-01-21 Time: 04:43:36

16-41-00-0100.jpg

ఆంధ్రప్రదేశ్ లో డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయండి..! మాస్టర్ కార్డ్ ఫౌండర్ ప్రెసిడెంట్ రాజమన్నార్ తో మంత్రి లోకేష్ భేటీ
2025-01-21 Time: 04:41:00

Related Videos