మహరాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతోంది. తొలి నుంచి అంచనా వేసినట్లుగానే ఫడ్నవీస్ ను బీజేపీ నాయకత్వం సీఎంగా ఖరారు చేసింది. బీజేపీ శాసనసభా పక్షం ఫడ్నవీస్ ను ఎంపిక చేసిన తరువాత మహాయుతి నేతలు గవర్నర్ ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్దత వ్యక్తం చేసారు. దీంతో, నేడు ప్రధానితో పాటుగా ఎన్డీఏ ముఖ్యుల సమక్షంలో మహారాష్ట్రకు మూడోసారి ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంలపై కూడా స్పష్టత వచ్చింది. కానీ, శాఖల ఖరారులో మాత్రం బీజేపీ కొత్త ట్విస్ట్ ఇచ్చింది.
ఎట్టకేలకు ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్దమైంది. ముఖ్యమంత్రి ఎంపిక పైన పది రోజులకు పైగా సస్పెన్స్ కంటిన్యూ అయింది. బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఫడ్నవీస్ ను ఎన్నుకున్నారు. ఏక్‌నాథ్‌షిండే, అజిత్‌పవార్‌తో కలిసి ఫడ్నవీస్ గవర్నర్‌ను కలిశారు. ఈ సాయంత్రం ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో తనతోపాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేయనున్నారు. మూడు పార్టీల నుంచి మంత్రుల సంఖ్యపై కూడా ఒక అంచనాకు వచ్చారు. డిప్యూటీ సీఎంగా షిండే ప్రమాణంపై కొంత ఉత్కంఠ కనిపించినా... చివరకు ప్రమాణం చేయడానికి సిద్దమయ్యారు.
కాగా మొన్నటి వరకు అధికారంలో ఉన్న షిండే ప్రభుత్వంలో
ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా పని చేసారు. ఇప్పుడు ఫడ్నవీస్ ప్రభుత్వంలో తిరిగి షిండే డిప్యూటీ సీఎంగా వ్యవహరించనున్నారు. 2019లో ఎన్సీపీ చీలిక వర్గంతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసారు. తాజాగా ప్రభుత్వ ఏర్పాటు వివరాలు వెల్లడించే సమయం లోనూ షిండే ఈ అంశాన్ని ప్రస్తావించారు. సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆజాద్ మైదాన్‌లో జరపటానికి ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి.
దేవేంద్ర ఫడ్నవీస్ ముచ్చటగా మూడోసారి మహారాష్ట్ర సీఎం పీఠాన్ని అధిరోహిస్తున్నారు. 1999 లో తొలిసారి ఎమ్మెల్యే అయిన ఫడ్నవీస్ వరుసగా నాలుగుసార్లు 2009, 2014, 2019, 2014లోనూ గెలుస్తూ వచ్చారు. 2014-19 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2019 లో తిరిగి సీఎం అయినా..ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో రాజీనామా చేసారు. షిండే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా వ్యవహరించారు. తాజా ఎన్నికల్లో మహాయుతి కూటమి గెలుపు .. సమన్వయంలో కీలకంగా వ్యవహరించారు. ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, బీజేపీ, ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos