ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు మండలంలోని బాదంపూడిలో ఒక వ్వక్తి కి బర్డ్ ఫ్లూ నిర్దారణ అయ్యింది. కోళ్లఫారం సమీపంలో ఉంటున్న ఆ వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించాయి. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపగా.. అతడికి బర్డ్ ఫ్లూ ఉన్నట్లు తేలింది. దీంతో జిల్లా వైద్య శాఖ అధికారులు అప్రమత్తమై.. అక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో ప్రజల్ని అలర్ట్ చేశారు. జిల్లాలో బర్డ్ ఫ్లూ తొలికేసు నమోదైనట్లు జిల్లా వైద్యశాఖధికారులు తెలిపారు. కేసు నమోదైన ప్రాంతంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని.. బర్డ్ ఫ్లూ సోకిన వారికి చికిత్స అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. బర్డ్ ఫ్లూ పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
మరోవైపు వేల్పూరు ప్రాంతంలో కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకడంతో.. అధికారులు ఒక కిలోమీటరు పరిధిని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. బర్డ్ ఫ్లూ విషయంలో ప్రజలు ఆందోళన చెందొద్దని.. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో పది కిలోమీటర్ల పరిధి వరకు సర్వెలెన్స్ ప్రాంతంగా ప్రకటించి కోళ్లు, వాటి ఉత్పత్తుల రవాణాను నిషేధించినట్లు జిల్లా ఉన్నతాధికారులు తెలిపారు. బర్డ్ ఫ్లూ నియంత్రణకు స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేశామని.. వలస పక్షులు సంచరించే చెరువులు, కొల్లేరు పరీవాహక ప్రాంతాల్లో ఈ వ్యాధి ప్రబలకుండా ర్యాపిడ్ టీంలు రంగంలోకి దిగాయన్నారు.
వ్యవసాయశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు మాట్లాడుతూ బర్డ్‌ఫ్లూ విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు ఉడికించిన మాంసం, గుడ్లు తినొచ్చని సూచించారు. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోయాయని.. అక్కడ శాంపిల్స్ తీసి భోపాల్ పంపగా బర్డ్‌ఫ్లూ అని తేలిందన్నారు. అక్కడ మిగిలిన కోళ్లు, గుడ్లను పూడ్చి వేశామని.. దీనిపై ఆందోళన చెందవద్దని ఆయన అన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos