ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ముంబయి బయలుదేరి వెళ్లారు. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారోత్సవానికి హజరయ్యేందుకు చంద్రబాబు వెళ్లారు. ముంబయిలో ఉన్న ఆజాద్ గ్రౌండ్స్ లో సాయంత్రం ఐదుగంటలకు మహారాష్ట్ర సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఎన్టీఏ నేతలందరూ ఈ సమావేశానికి వస్తుండటంతో చంద్రబాబు కూడా విజయవాడ నుంచి ముంబయి బయలుదేరి వెళ్లారు. ముంబయిలో సాయంత్రం ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే చంద్రబాబు అక్కడి నుంచి విమానంలో నేరుగా విశాఖపట్నానికి చేరుకుంటారు. రాత్రి విశాఖలో బస చేయనున్నారు. విశాఖలో రేపు జరగనున్న డీప్ టెక్నాలజీ సమ్మిట్ 2024కు చంద్రబాబు హాజరు కానున్నారు. ఈ సదస్సు తర్వాత విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలెప్ మెంట్ అధారిటీ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం చంద్రబాబు విశాఖలో బయలుదేరి గన్నవరం విమానాశ్రయం చేరుకోనున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos