ఏపీ రాజకీయాల్లో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ఏడాది పాలన పైన టీడీపీ ప్రజల్లోకి వెళ్లింది. జగన్ లక్ష్యంగా కూటమి రాజకీయం చేస్తోంది. తాము తిరిగి అధికారంలోకి వస్తామని వైసీపీ చెబుతుంటే.. ఎలా వస్తారో చూస్తామని పవన్ సవాల్ చేస్తున్నారు. ఈ సమయంలోనే వైసీపీ నుంచి జనసేనలో చేరిన జగన్ సన్నిహితుడు బాలినేని పైన పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. దీంతో, ఇప్పుడు పరిస్థితిలో ఏమైనా మార్పు వస్తుందా అనే చర్చ మొదలైంది. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి.. జగన్ బంధువు బాలినేని జనసేనలో చేరినా రాజకీయంగా ప్రయోజనం కనిపించటం లేదు. ఇప్పటివరకు ఒంగోలులో కూటమి నేతలు బాలినేనితో కలిసి పని చేసేందుకు ముందుకు రావటం లేదు. బాలినేని కూటమిలోకి రావటాన్ని ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల వ్యతిరేకిస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో తమను ఇబ్బంది పెట్టిన బాలినేనితో కలిసి పని చేసే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. అయితే, పవన్ పైన నమ్మకంతో బాలినేని జనసేనలో కొనసాగుతున్నారు. బాలినేనికి పదవి ఇస్తారనే ప్రచారం సాగినా.. ఇప్పటివరకు ఎలాంటి బాధ్యతలు అప్పగించ లేదు. కాగా, తాజాగా పవన్ మార్కాపురం సభలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.

మార్కాపురం సభలో వేదిక పైన బాలినేని కూర్చోవటం చర్చనీయాంశంగా మారింది. సభలో పవన్ ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు. జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తనకు ఆత్మీయుడని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ఆయన వైసీపీలో ఉన్నా వ్యక్తిగతంగా ఆయనతో తనకు గొడవలు లేవన్నారు. గత ప్రభుత్వంలో కూడా కొన్ని సందర్భాల్లో బాలినేని తనకు అండగా నిలిచారని తెలిపారు. సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి అని, రాజకీయాలు ఎలా చేయాలో తెలిసిన వ్యక్తి అని పేర్కొన్నారు. అందుకే ఆయనను జనసేనలోకి ఆహ్వానించానని, కుటుంబంలోకి కొత్త వ్యక్తి వస్తే కొన్ని సమస్యలు వస్తాయని సరిదిద్దుకోవాలని సూచించారు. కూటమిలో అందరూ కలిసి పని చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు.

ఇదిలా ఉండగా 2019- 24 వరకు ప్రకాశం జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలతో ఇప్పుడు బాలినేనితో కలిసి పని చేసేందుకు టీడీపీ నేతలు సుముఖంగా లేరు. ఒంగోలు కేంద్రంగా బాలినేని కారణంగా తమ పార్టీ నేతలు ఇబ్బందులు పడ్డారని టీడీపీ నేతలు చెబుతున్నారు. బాలినేనికి ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం సాగినా.. ఇప్పటి వరకు ఆ ప్రస్తావన లేదు. ఈ సమయంలో పవన్ కూటమి నేతలకు చేసిన సూచన టీడీపీ జిల్లా ముఖ్యులు అమలు చేస్తారా అనేది సందేహంగా కనిపిస్తోంది. బాలినేని తనకు గుర్తింపు లేకపోవటం.. పట్టించుకోవటం లేదనే ఆవేదనతో ఉన్నారని గుర్తించిన పవన్ తన సభలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే, బాలినేని విషయంలో టీడీపీ నేతల వైఖరి ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Take Oath As A TDP National Working President | CM Chandrababu | AG

తాజా వార్తలు

17-37-49-0649.jpg

రాజ్యసభ జనసేన పార్టీ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
2026-06-06 Time: 05:37:49

17-10-05-0605.jpg

రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేస్తా.. నామినేషన్ దాఖలు అనంతరం మీడియాతో లింగమనేని రమేష్ 
2026-06-06 Time: 05:10:05

14-47-28-0628.jpg

శ్రీసిటీలో రైల్వే ట్రాక్ రోలింగ్ మిల్లు ఏర్పాటు చేయండి.. నోవోస్టల్ ఎం చైర్మన్ ఇవాన్ డెమ్చెంకో కు  మంత్రి నారా లోకేష్ విజ్ఞ‌ప్తి
2026-06-04 Time: 02:47:28

17-11-24-0624.jpg

పోర్టు ఆధారిత కెమికల్ లాజిస్టిక్స్ హబ్ ల నిర్మాణంలో భాగస్వామ్యం వహించండి.. రస్ కెమ్ గ్రూప్ డిప్యూటీ సిఇఓ ఇల్యా కోసిహ్ తో మంత్రి లోకేష్ భేటీ
2026-06-03 Time: 05:11:24

17-08-34-0634.jpg

హెల్తీ సిటిజన్స్‌తోనే వెల్తీ నేషన్ నిర్మాణం.. లలితా పీవీఎస్ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు 
2026-06-03 Time: 05:08:34

Related Videos