దావోస్: అధునాతన ప్యాసింజర్ కార్ ఛాసిస్ ఆవిష్కరణలతో గ్లోబల్ సప్లయ్ చైన్ బలాన్ని పెంచుకునేందుకు జాయింట్ వెంచర్ గా ఆవిర్భవించిన జడ్ఎఫ్ ఫాక్స్ కాన్ ఛాసిస్ మాడ్యుల్స్ సంస్థ సిఇఓ ఐకీ డోర్ఫ్ తో రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వడేర్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఆటోమొబైల్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని అన్నారు. కియా, ఇసుజి వంటి ప్రఖ్యాత సంస్థలు తమ ప్యాసింజర్ కార్ల తయారీ యూనిట్లను ఎపిలో నెలకొల్పాయి. అశోక్ లే ల్యాండ్, వీర & ఆజాద్ మొబిలిటీ వంటి బస్ తయారీ OEMలు కూడా ఆంధ్ర ప్రదేశ్ లో తమ తయారీ కార్యకలాపాలను విస్తరించాలని చూస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం పెట్టుబడులకు పూర్తి సానుకూల పర్యావరణ వ్యవస్థ అందుబాటులో ఉంది. ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, సరఫరా సప్లయ్ చైన్ ఏర్పాటుకు విశాఖపట్నం, విజయవాడ, అనంతపురం వ్యూహాత్మక ప్రాంతాలు. జడ్ఎఫ్ ఫాక్స్ కాన్ ఛాసిస్ మాడ్యుల్స్ సంస్థ తయారీ యూనిట్ ను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయండి. ఆంధ్రప్రదేశ్ లోని విశాలమైన రోడ్లు, పోర్టులు, ఎయిర్ పోర్టులో సప్లయ్ చైన్ కార్యకలాపాలను మెరుగుపర్చుకునేందుకు దోహదపడతాయి. దేశంలో అతిపెద్ద టాలెంట్ పూల్ గా ఉన్న ఎపిలో ఉపాధి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై మేం దృష్టి సారించాం. ఎపిలో ఇంజనీరింగ్, స్కిల్లింగ్ కేంద్రాల ఏర్పాటుకు మీవంతు సహాయ, సహకారాలు అందించాలని మంత్రి లోకేష్ కోరారు.
జడ్ ఎఫ్ ఫాక్స్ కాన్ ఛాసిస్ మాడ్యుల్స్ సిఇఓ ఐకీ డోర్ఫ్ మాట్లాడుతూ... భారత్ లో జడ్ ఎఫ్ ఫాక్స్ కాన్ ఛాసిస్ మాడ్యుల్స్, హీరో మోటార్స్ జాయింట్ వెంచర్ చెన్నయ్ లోని ఒరగడమ్ లో ఒక ప్లాంట్ ను నిర్వహిస్తోంది. బిఎండబ్ల్యుకి కీలకమైన గ్లోబల్ కస్టమర్ గా సేవలందిస్తోంది. ఈ ఏడాది జనవరిలో జడ్ఎఫ్ రాణే ఆటోమోటివ్ ఇండియాతో కలిసి జాయింట్ వెంచర్ గా ఏర్పాటై భారతదేశంలో రాక్ డ్రైవ్ ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ సిస్టమ్‌లను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలను ప్రకటించాయి. బెంగుళూరు, చెన్నయ్, కోయంబత్తూరు, గురుగ్రామ్, హైదరాబాద్, ముంబై, పూణేల్లో కంపెనీ తయారీ యూనిట్లు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీరంగంలో ఫాక్స్‌కాన్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నైపుణ్యం మాదిరిగానే... EVల కోసం కాంట్రాక్ట్ తయారీకి విస్తరించే ప్రణాళికలను ఫాక్స్‌కాన్ ప్రకటించింది. భారతదేశంలోని ఆటోమొబైల్ కంపెనీలతో తమ ఉత్పత్తులను తయారు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది, ప్రస్తుతం భారత్ లో $4.4 బిలియన్లుగా ఉన్న అమ్మకాలను 2029నాటికి $8.8 బిలియన్లకు చేరుకోవాలన్నది తమ లక్ష్యం. జడ్ఎఫ్ ఫ్యాక్స్ కాన్ ఛాసిస్ మాడ్యుల్ కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఆసియాలోని ప్రముఖ ఎన్ ఈవి కంపెనీలను కొనుగోలు చేయడంపై దృష్టిసారిస్తున్నాం. మాతృ సంస్థ డిజైన్, ఆవిష్కరణ, బ్రాండింగ్‌పై దృష్టి పెట్టాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలపై కంపెనీ బోర్డులో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని డోర్ఫ్ తెలిపారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos