తొలిరోజు వసూళ్లలో ఆదిపురుష్ రికార్డులు కొల్లగొట్టింది. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ఈ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. విమర్శకుల సమీక్షలు, ప్రేక్షకుల మౌత్ టాక్ వంటి అంశాలతో సంబంధం లేకుండా మొదటి రోజు భారీ వసూళ్ళు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు వంద కోట్లకు పైగా వసూళ్ళు సాధించినట్టు ట్రేడ్ వర్గాల సమాచాం. ఈ సినిమాతో ప్రభాస్ మరో రేర్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఏపీ, తెలంగాణలో ఈ చిత్రం దాదాపు రూ. 58.50 కోట్లు నెట్ వసూలు చేసినట్లు తెలిసింది.
అలాగే, మిగిలిన భాషలు, అన్ని ప్రాంతాలనూ కలిపి ఈ సినిమా మొత్తంగా మొదటి రోజు వందకోట్లకు పైగా రాబట్టిందని సమాచారం. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన షారుఖ్ ఖాన్ సినిమా పఠాన్ రికార్డును ఆదిపురుష్ చెరిపేసింది. ఆదిపురుష్ హిందీ వెర్షన్ తొలిరోజు వసూళ్లు రూ.30 కోట్లు.. మిగతా భాషల్లో రూ.75 కోట్ల వరకూ ఆర్జించిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
తెలుగు వెర్షన్ కు ప్రభాస్ ఫ్యాన్స్ పట్టం కట్టారు. సినిమా తొలి రోజు వసూళ్లలో మెజారిటీ షేర్ ను తెలుగు ప్రేక్షకులే ఆర్జించి పెట్టినట్లు తెలుస్తోంది. కాగా... సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్ నేపథ్యంలో వీకెండ్ తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. మరోవైపు ఈ సినిమాను వివాదాలు చుట్టుముడుతున్నాయి. సినిమా బాగాలేదన్నాడని హైదరాబాద్ లో ఓ ప్రేక్షకుడిపై ప్రభాస్ ఫ్యాన్స్ దాడి చేశారు. తాజాగా ఆదిపురుష్ సినిమాపై హిందూ సేన కోర్టుకెక్కింది. మతపెద్దలను కించపరిచేలా ఈ సినిమాలో చూపించారని, ఆ సన్నివేశాలను తొలగించేలా ఆదేశించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వివాదాల సంగతి ఇలా ఉంటే... వసూళ్లలో మాత్రం ఆదిపురుష్ ... వేగంగా వెళుతోంది. ఈ వేగం... ఎన్నిరోజులు సాగుతుందో చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos