లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు బీఆర్ఎస్ ను టార్గెట్ చేశాయి. వరుసగా బీఆర్ఎస్ ఎంపీలు బీజేపీలో చేరుతున్నారు. నాగర్ కర్నూలు ఎంపీ రాములు బీజేపీలో చేరిన 24 గంటల్లోనే మరో ఎంపీ కాషాయం కండువా కప్పుకున్నారు. సీనియర్ రాజకీయ నాయకుడు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీ కండువా కప్పుకున్నారు. పాటిల్ కొంత కాలంగా బీజీపీ నేతలతో టచ్ లో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. తనకు జహీరాబాద్ సీటు ఇవ్వాలని..అందుకు అంగీకరిస్తే పార్టీ మారేందుకు సిద్దమని చెప్పినట్లు సమాచారం. దీంతో, ఇప్పుడు ఆయన వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేయనున్నారు. బీబీ పాటిల్ వరుసగా 2014, 2019 ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి బీఆర్ఎస్ తరపున రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. నియోజకవర్గంలో పట్టు సాధించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిన తరువాత ఆయనతో బీజేపీ నేతలు టచ్ లోకి వెళ్లి తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. తాజాగా ఎంపీ రాములు బీజేపీలో చేరిన తరువాత పాటిల్ కు సీటు పైన హామీ దక్కినట్లు చెబుతున్నారు. ఫలితంగా ఆయన పార్టీలో చేరారు..స్థానిక బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరుతుండగా... ఎంపీలు బీజేపీ బాట పట్టారు. దీంతో, వచ్చే లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ నాయకత్వానికి పరీక్షగా మారుతున్నాయి. దేశ వ్యాప్తంగా 400 సీట్లు గెలవటం పైన గురి పెట్టిన బీజేపీ ఇతర పార్టీల నుంచి వచ్చే ఎంపీలకు ఛాన్స్ ఇస్తోంది. తెలంగాణలోనూ ఆపరేషన్ కొనసాగిస్తున్న క్రమంలో నేతల చేరికల ప్రక్రియ వేగం పుంజుకుందని విశ్లేషకులు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos