ఏపీకి షాకింగ్ న్యూస్ లాంటిది ఒకటి చర్చనీయాంశమైంది. జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తరువాత ... ఒక చక్కటి అవకాశాన్ని వినియోగించుకోలేక పోవడంతో... ఆ ఆపర్చునిటీని... పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రం చక్కగా వినియోగించుకుంది. రాష్ట్ర విభజన తర్వాత ... 2014లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న నమ్మకం, ఆయన చొరవతో రాష్ట్రానికి అనేక కంపెనీలు వచ్చాయి. వాటిలో యూఏఈకి చెందిన లులూ గ్రూప్ కూడా ఒకటి. విశాఖలో రూ.2,200 కోట్ల పెట్టుబడితో ఓ భారీ షాపింగ్ మాల్‌ నిర్మించడానికి ఆ గ్రూప్ రెడీ అన్నది.

దీంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం దానికి 13 ఎకరాల స్థలం లీజుగా ఇచ్చింది. లులూ గ్రూప్ అక్కడ నిర్మాణ పనులు మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్న వేళ... ఏపీలో ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి వచ్చి దానికి రెడ్ సిగ్నల్ చూపి బ్రేకులు వేసింది. ఇదిలావుండగా... తెలంగాణ ఐ‌టీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటనలో లులూ గ్రూప్‌తో ఒప్పందం చేసుకొన్నారు. దాని ప్రకారం లులూ గ్రూప్ ఇప్పుడు హైదరాబాద్‌లో రూ.3,500 కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది. ఇందులో భాగంగా రూ.300 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న ఓ భారీ షాపింగ్ మాల్‌కి ఈ ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెలల్లో ప్రారంభోత్సవం కానుంది. ఇదిగాక తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు, వాటి ఎక్స్ పోర్ట్ కంపెనీని కూడా ఏర్పాటు చేస్తోంది.

వీటన్నిటి ద్వారా సుమారు 2-3,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, పరోక్షంగా అనేక వేలమందికి ఉపాధి లభించనున్నాయి. జగన్ ప్రభుత్వం వద్దనుకొన్న లులూ గ్రూప్‌నకు... కేరళ, తమిళనాడు, తెలంగాణ, చివరికి జమ్ము కశ్మీర్ రాష్ట్రం కూడా రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలకడంతో ఆయా రాష్ట్రాలలో అది భారీ షాపింగ్ మాల్స్ నిర్మిస్తోంది. జగన్ సర్కార్ వాత పెట్టడంతో... ఏపీ గురించి అస్సలు తలచుకోవడం లేదని తెలుస్తోంది. జగన్ తీరు ఇలాగే ఉంటే... పారిశ్రామిక అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని సర్వత్రా ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos