ఏపీ రాజకీయాల్లో క్షణక్షణానికి పరిణామాలు ఛేంజ్ అవుతున్నాయి. వారాహి వాహన యాత్రతో పవన్ కళ్యాణ్ పొలిటికల్ హీట్ పెంచిన క్రమంలో... గోదావరి జిల్లాల్లోని ద్వారంపూడి, ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామజోగయ్య మాటల దాడితో ఆ రెండు జిల్లాల్లో కాపు వర్గాల్లో కాక రేగుతోంది. ఈ గొడవ ఇంకా సద్దుమణగకముందే... ఇప్పుడు వైసీపీ నేత, ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి సడెన్ ఎంట్రీ ఇచ్చి పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు.
మీ అన్నయ్య చిరంజీవి చంద్రబాబుకు సపోర్ట్ చేయనని చెప్పారని.. నువ్వేమో చంద్రబాబు చెప్పినట్లు ఆడుతున్నావని.... చంద్రబాబు ఆదేశాలతోనే వైసీపీని తిడుతున్నావంటూ ఆరోపించారు. 1981 నుంచి ముద్రగడ కాపుల కోసం పోరాడుతున్నారని పోసాని ప్రశంసించారు. కాపుల కోసం ముద్రగడ తన ఆస్తిని, పదవులను కోల్పోయారని ... ఆయన ఏ రోజూ రాజకీయంగా, ఆర్ధికంగా లబ్ధి పొందలేదన్నారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలను చంద్రబాబు కొన్నారని.. వంగవీటి మోహన రంగాను హత్య చేయించారని కృష్ణ మురళీ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
ముద్రగడ పద్మనాభంకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ముద్రగడ 1981 నుంచి కాపుల కోసం పోరాడుతున్నారని, ఆయన తన ఉద్యమంలో ఒక్క రూపాయి తిన్నట్లు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి వెళ్లిపోతానని పోసాని సవాల్ విసిరారు. ఒకవేళ నిరూపించలేకపోతే నువ్వు ఎక్కడికీ వెళ్లనవసరం లేదని.. నేరుగా ముద్రగడ వద్దకు వెళ్లి నిజం తెలుసుకున్నానని చెప్పి క్షమాపణ అడుగు అని పోసాని సలహా ఇచ్చారు. అలా చేస్తే నువ్వు నిజంగానే చాలా గొప్పవాడివి అవుతావు అని పోసాని వ్యాఖ్యానించారు. పోసాని వ్యాఖ్యలతో ... ఇప్పటిదాకా కాపుల్లో రగులుతున్న అలజడి మరో పొలిటికల్ టర్న్ తీసుకుందని రాజకీయ వర్గాల్లో విశ్లేషిస్తున్నారు. దీనిపై మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos