గత కొన్ని రోజులుగా ఆసియా కప్ 2023 పై వస్తున్న సందిగ్ధతకు తెరపడింది. మా దేశంలోనే ఆసియా కప్ జరగాలని పాకిస్తాన్ పట్టుబడితే.. అక్కడ జరిగితే మేము ఆడేది లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ఆసియా కప్ జరుగుతుందా లేదా అనే అనుమానం కూడా అభిమానుల్లో కలిగింది. అయితే తాజాగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆసియా కప్ తేదీలను ప్రకటించింది. హైబ్రీడ్ మోడల్ లో ఆసియాకప్ జరగనుంది. ఆగస్టు 31నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్ జరగనుంది. వన్డే ప్రపంచకప్ ముందు జరుగుతున్న నేపథ్యంలో ఈ టోర్నీని వన్డే ఫార్మాట్ లో నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఈసారి ఆసియా కప్ పాకిస్తాన్ వేదికగా జరగాల్సి ఉంది.

అయితే ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులు.. భద్రత వంటి కారణాలతో టీమిండియాను పాక్ కు పంపేది లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇదిలావుండగా... టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ త్వరలో విండీస్ టూర్ ముగిశాక ... తొమ్మిదేళ్ల తరువాత ... ఈ ఏడాది ఆగస్టు నుంచి పాకిస్తాన్, శ్రీలంక వేదికగా జరిగే ఆసియా కప్ వన్డే ఫార్మాట్ లో ఆడనున్నాడు. కోహ్లీ చివరిసారిగా 2014లో ఆసియా కప్ ఆడాడు. 2015 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో అంతకుముందు ఏడాది వన్డే ఫార్మాట్ లో ఆసియా కప్ జరిగింది.

ఆ టోర్నీలో కోహ్లీ ఆడాడు. ఆ తర్వాత ఆసియా కప్ వన్డే ఫార్మాట్ లో 2018 లో జరిగింది. కానీ 2018లో  కోహ్లీకి సెలక్టర్లు  రెస్ట్ ఇచ్చారు. వర్క్ లోడ్ మేనేజ్ మెంట్ లో భాగంగా కోహ్లీకి ఆ ఏడాది విశ్రాంతినిచ్చారు సెలక్టర్లు. దీంతో  ఆ ఏడాది భారత జట్టును రోహిత్ శర్మ నడిపించాడు. 2018లో భారత జట్టు కప్పు కూడా కొట్టింది. 2014లో భారత జట్టు ఆసియా కప్  లో దారుణంగా విఫలమైంది. ఈ టోర్నీలో కోహ్లీ.. ఓ సెంచరీ, మూడు అర్థ సెంచరీలు చేసినా  భారత జట్టు మాత్రం ఫైనల్ చేరడంలో విఫలమైంది.

లీగ్ దశలో బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ లను ఓడించిన భారత జట్టు..  సూపర్ - 4లో పాకిస్తాన్ చేతిలో ఓడింది. కోహ్లీ ఆసియా కప్ లో 10 మ్యాచ్ లు ఆడి 61.3 సగటుతో 613 పరుగులు చేశాడు. కోహ్లీ హయ్యస్ట్ స్కోరు 183 పరుగులు కూడా ఇక్కడే నమోదైంది. 2018 తర్వాత కరోనా, ఇతరత్రా కారణాలతో ఆసియా కప్ వన్డే ఫార్మాట్ లో జరుగనుండటం ఇదే ప్రథమం. మరి  తొమ్మిదేళ్ల తర్వాత బరిలోకి దిగబోతున్న కోహ్లీ.. ఈ ఆసియా కప్ లో ఏ మేరకు ఆడతాడో వేచి చూడాలి. 

యూట్యూబ్ లైవ్

LIVE : పెన్షన్ల పంపిణీ..CM Chandrababu Pension Distribution @ Palnadu | NTR Bharosa | Amaravati Gala

తాజా వార్తలు

19-43-09-0109.jpg

స్మోక్ ఫ్రీ సిగరెట్ తయారీ యూనిట్ కు గుంటూరు, ప్రకాశం జిల్లాలు అనుకూలం.. ఫిలిప్ మోరిస్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రియా గోంట్కోవికోవాతో లోకేష్ భేటీ
2025-01-21 Time: 07:43:09

17-55-03-0103.jpg

ఏపీలో జడ్ఎఫ్ ఫాక్స్ కాన్ వాహన తయారీ యూనిట్ నెలకొల్పండి..! సిఇఓ ఐకీ డోర్ఫ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ
2025-01-21 Time: 05:55:03

17-52-33-0133.jpg

ఇక ఆ విషయంపై మాట్లాడొద్దు - జనసేన శ్రేణులకు హైకమాండ్ కీలక ఆదేశాలు..!
2025-01-21 Time: 05:52:33

16-43-36-0136.jpg

దావోస్ లో సిస్కో వైస్ చైర్మన్ ప్రాన్సిస్ కట్సౌదాస్ తో మంత్రి లోకేష్ భేటీ.. ఏపీలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని విజ్ఞప్తి..!
2025-01-21 Time: 04:43:36

16-41-00-0100.jpg

ఆంధ్రప్రదేశ్ లో డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయండి..! మాస్టర్ కార్డ్ ఫౌండర్ ప్రెసిడెంట్ రాజమన్నార్ తో మంత్రి లోకేష్ భేటీ
2025-01-21 Time: 04:41:00

Related Videos