రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి టీడీపీలో గత కొంతకాలంగా జరుగుతున్న చర్చకు నేడు తెరపడింది. ఈ ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం అభ్యర్థిని పోటీ పెడుతుందా లేదా అన్నదానిపై క్లారిటీ వచ్చింది. అభ్యర్థిని నిలబెట్టే ఆలోచన లేదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు తెలిపారు. టీడీపీ అభ్యర్థిని నిలబెడితే వైసీపీకి గట్టి పోటీ ఉంటుందని ఇంతకాలం పాటు ప్రచారం జరిగింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ దక్కని వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీపై ఆగ్రహంతో ఉన్నందున టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేస్తారని అధిష్టానం భావించింది. కానీ అది వర్కవుట్ అయ్యేలా కనిపించకపోవడంతో టీడీపీ పోటీ చేసే యోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. దీంతె వైసీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబు పార్టీ నేతలతో మాట్లాడుతూ స్వయంగా ఆయనే క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీకి చెందిన పలువురు కీలక నేతలు తనతో టచ్ లోకి వస్తున్నారని.. అయితే పార్టీలో చేర్చుకునే విషయంలో ఎలాంటి హామీ ఇవ్వడం లేదని చంద్రబాబు చెప్పారు. వైసీపీ నుంచి వచ్చిన అందరినీ తీసుకోలేము .. అన్నీ ఆలోచించే నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున అందరూ .. ఎన్నికల మూడ్ లోకి రావాలని పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos