కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లకు ఒప్పుకోకపోవడంతో అన్నదాతలు మళ్లీ తమ ఢిల్లీ ఛలో మెగా మార్చ్‌ను కొనసాగించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం నుంచి మళ్లీ దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం అయ్యారు. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడం సహా వివిధ రకాల డిమాండ్లను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. వివిధ రాష్ట్రాల్లోని అన్నదాతలు ఈ నెల 13 వ తేదీన దేశ రాజధాని ఢిల్లీకి మెగా మార్చ్ ప్రారంభించడం... దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం రైతులను.. ఢిల్లీ, పంజాబ్, హర్యానా సరిహద్దుల వద్దే నిలిపివేయడం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రుల బృందంతో రైతు సంఘాల నేతలు నిర్వహించిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో తిరిగి తమ ఆందోళనలను కొనసాగించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఈసారి మరింత పకడ్బందీగా రైతులు ఆందోళన యాత్ర చేపట్టి.. ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీలోకి చేరుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇనుప షీల్డ్‌లు, జూట్ బస్తాలను సిద్ధం చేసుకున్నారు. పంజాబ్-హర్యానా బోర్డర్‌లోని శంభు సరిహద్దు వద్ద ఈ ఇనుప కవచాలు, జూట్ బ్యాగులను తరలించుకున్నారు. పోలీసులు వదిలే టియర్ గ్యాస్ షెల్స్ నుంచి తప్పించుకునేందుకు ఈ ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది.ఏది ఏమైనా ఈసారి తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసే విధంగా రైతు సంఘాలు ఆందోళన చేయనున్నట్లు తెలుస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos