రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు గుడ్ న్యూస్. అమరావతి రైతులకు వార్షిక కౌలు చెల్లింపుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కౌలుకు సంబంధించిన బిల్లుల వ్యవహారం సీఎఫ్‌ఎంఎస్ దగ్గర పెండింగ్‌లో ఉందని సీఆర్‌డీఏ తరఫు లాయర్ హైకోర్టుకు తెలిపారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు పురోగతిపై వివరాలు సమర్పించాలని సీఆర్‌డీఏను ఆదేశించింది. ఈ పిటిషన్‌పై విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు. రైతులకు కౌలు చెల్లింపునకు సంబంధించి జాప్యం జరుగుతుండటంతో దీన్ని సవాల్ చేస్తూ మంగళగిరికి చెందిన రైతు పోతినేని శ్రీనివాసరావు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రూ. 200 కోట్ల విడుదలకు ప్రభుత్వం జీవో ఇచ్చిందని... త్వరలో సొమ్ము జమ అవుతుందని కూడా ప్రభుత్వం చెప్పిందని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. రైతులకు ఏటా మే 31లోపు వార్షిక కౌలు జమ చేయాల్సిన చట్టబద్ధ బాధ్యత ప్రభుత్వం, సీఆర్‌డీఏపై ఉందని... అయినా కౌలును చెల్లించడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని కోర్టు దృష్టికి తెచ్చారు. పిటిషనర్ తరఫు లాయర్ ఈ మేరకు వాదనలు వినిపించారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది తన వాదన వినిపిస్తూ... కౌలు డబ్బులు రూ.200 కోట్లను త్వరలోనే విడుదల చేస్తామని, రైతుల ఖాతాల్లో సొమ్ము జమ అవుతుందని అన్నారు. సో... అమరావతి రైతులకు ఇది శుభవార్త అన్నమాట.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos