పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆ సినిమాలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కూడా కైవసం చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా నిలిచాడు. దాంతో, బన్నీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఒక రోజులో తన దిన చర్య ఎలా ఉంటుంది? షూటింగ్ ముందు ఏం చేస్తాడు? షాట్ కు ఎలా ప్రిపేర్ అవుతాడనే విషయాల సమాహారంతో ఇన్‌స్టాగ్రామ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన వీడియోను షేర్ చేశాడు. ఇలా ఇన్‌స్టాగ్రామ్ ఒక భారతీయ నటుడి వద్దకు ఒక రోజులో తను ఏం చేస్తాడనే విషయాలను వీడియో రూపంలో చూపించటం ఇదే మొదటిసారి. ఈ వీడియోలో బన్నీ నివాసం, రామోజీ ఫిల్మ్ సిటీలో 'పుష్ప 2' షూటింగ్ స్పాట్, తన అభిమానులతో బన్నీ ఎలా ఉంటాడనే విషయాలను చూపించింది. ప్రతిరోజు నిద్ర లేవగానే గార్డెన్ లోకి వచ్చి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ బ్లాక్ కాఫీ తాగడం, మధ్యాహ్నం ఒంటి గంట అవగానే తన పిల్లలతో వీడియో కాల్ చేసి మాట్లాడే విషయాలను చూపెట్టింది. ఇక సెట్స్ లో దర్శకుడు సుకుమార్ తో సినిమా గురించి చర్చించి, సెట్స్‌లో ఓ షాట్ ను చిత్రీకరించే విషయాన్ని కూడా వీడియోలో చూపించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ అభిమానుల కోసం ఇన్ స్టాగ్రామ్ మొదటిసారిగా హైదరాబాద్ వచ్చి, అల్లు అర్జున్ తో కలిసి వీడియో చెయ్యటం నిజంగానే ఒక సర్ ప్రైజ్. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయింది. బన్నీ అభిమానులకి అయితే పండగే పండగ. మొదటిసారి ఒక తెలుగు నటుడి కి ఇలా ఉత్తమ నటుడు అవార్డు రావటంతో అల్లు అర్జున్ చరిత్ర సృష్టించినట్లే. ఇప్పుడు ఈ వీడియోతో 'పుష్ప 2' ... ది రూల్ మీద కూడా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అభిమానులు ఎలా వుంటారు, వాళ్ళని అల్లు అర్జున్ ఎలా రిసీవ్ చేసుకుంటాడు, ఇవన్నీ ఇందులో ఇన్ స్టాలో చూపించారు. ఏదిఏమైనా ... ఇన్ స్టా ఇండియాకు అదీ మన హైదరాబాద్ కు రావడం... అల్లు అర్జున్ కు విస్తృతంగా కవరేజి ఇవ్వడం రియల్లీ గ్రేట్ కదా.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos