మణిపూర్ లో రెండు జాతుల మధ్య చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల అంశం పార్లమెంటులో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ అల్లర్లపై ప్రధాని మోదీ పార్లమెంటులో ప్రకటన చేయాలని విపక్షాలు చేస్తున్న డిమాండ్ ను బీజేపీ సర్కార్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ అంశం కారణంగా ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో... తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. పార్లమెంటులో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతుండగా మైక్ ఆఫ్ చేశారని... దీంతో మేము సభ నుంచి వాకౌట్ చేయక తప్పలేదని టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రియన్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. మణిపూర్ పై ప్రధాని మోడీ పార్లమెంటు లోపల స్టేట్‌మెంట్ ఇవ్వాలనే డిమాండ్ తో పాటు ఇతర డిమాండ్లను ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో లేవనెత్తగా బీజేపీ ఎంపీలు ఆయనకు అడ్డు తగిలారని వివరించారు. ‘ఇండియా’ కూటమి డిమాండ్లను లేవనెత్తుతుండగా అడ్డుకున్నారని, ఏకంగా పార్లమెంటు ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గేకే తరుచూ అంతరాయాలు సృష్టించారని తెలిపారు. మరోవైపు ... మణిపూర్ అంశంలో... విపక్ష కూటమి ఇండియా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మణిపూర్ అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో... కేంద్రానికి వ్యతిరేకంగా లోక్ సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ఏం జరుగుతుందోమరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos