పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ఎప్పుడూ ముందుండే కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళవారం విజయవాడలోని కృష్ణలంక ఐస్ ఫాక్టరీ వద్ద కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో కలిసి టీడీపీ నాయకుడు కేశినేని చిన్ని ప్రారంభించారు. ముందుగా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి అందరూ నివాళులర్పించారు. అనంతరం కేశినేని చిన్ని మాట్లాడుతూ పేద ప్రజలకు మంచి వైద్యం అందించాలన్నది ఎన్టీఆర్ ఆశయమని... చంద్రబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగించేందుకు కేశినేని ఫౌండేషన్ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. పేద ప్రజలకు అవసరసమైన వైద్య సేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ... మేం కేవలం వైద్య పరీక్షలు చేయడం మాత్రమే కాదని.. వారికి అవసరమైన మందులు కూడా పంపిణీ చేస్తున్నామని కేశినేని చిన్ని అన్నారు. బసవతారకం ఆసుపత్రి ఆధ్వర్యంలో క్యాన్సర్ పరీక్షలు చేసి, అవసరమైనవారికి వైద్యం కూడా అందిస్తామని చెప్పారు. కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు పార్టీలకతీతంగా కొనసాగుతున్నాయన్నారు. రానున్న రోజుల్లో టీడీపీ అధికారంలోకి రావడం.. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం తథ్యమని కేశినేని చిన్ని ధీమా వ్యక్తం చేశారు. కాగా... మెడికల్ క్యాంపునకు పెద్దఎత్తున పేదప్రజలు తరలివస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే కేశినేని ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అందించింది. కాగా.. ఇప్పుడు చేపట్టిన మెగా మెడికల్ క్యాంపుకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. వేల సంఖ్యలో రోగులకు నిష్ణాతులైన వైద్యులు వైద్య చికిత్సలు అందించారు. అలాగే అవసరమైన రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. వైద్య శిబిరానికి వచ్చిన వారికి ఆరోగ్య అన్న క్యాంటీన్ ద్వారా ఉచిత భోజన సదుపాయాన్ని కూడా కల్పించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos