ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన కూతురుకు ప్రేమ పెళ్లి దగ్గరుండి జరిపించారు. ఎమ్మెల్యే మొదటి కూతురు అయిన పల్లవికి ... ఆమె ప్రేమించిన పవన్ అనే యువకుడితో బొల్లవరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంప్రదాయబద్ధంగా పెద్దల సమక్షంలో పెళ్లి చేశారు. ఆ తర్వాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించారు. ఇక... ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వివాహం గురించి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రొద్దుటూరు ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలని... నా కుటుంబానికి సంబంధించిన సంతోషకరమైన వార్తతో మీ ముందుకు వచ్చానని అన్నారు. నాకు ఇద్దరు కూతుళ్లు. ఈ రోజు నా మొదటి కూతురు పల్లవి వివాహాన్ని నిరాడంబరంగా చేశానని... ప్రేమించిన వ్యక్తితో కులాంతర వివాహం జరిపించానని... ఇందుకు నేను సంతోషిస్తున్నాను.. గర్వపడుతున్నానని అన్నారు. స్థాయికి, డబ్బుకు, కులానికి ప్రాధాన్యత ఇవ్వకుండా నా కూతురు ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి చేశానని... చాలా గొప్పగా పెళ్లి చేద్దామంటే ఒప్పుకోకపోవడంతో.. ఆమె కోరుకున్న విధంగానే సింపుల్‌గా చేశానని ఎమ్మెల్యే అన్నారు. ఆడపిల్లలకు అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని... వారి నిర్ణయాలు బాగోలేకపోతే.. సూచనలు చేయడమే తల్లిదండ్రుల బాధ్యత అని అన్నారు. నా బిడ్డ కోరుకున్న ప్రకారమే కులాంతర వివాహాన్ని సంతోషంగా చేశానని అన్నారు. అబ్బాయి ఎంబీఏ చేశాడు. హైదరాబాద్‌లోని కంపెనీలో పనిచేస్తున్నాడని... చదువు, ఉద్యోగానికి ప్రాధాన్యత ఇచ్చే ... ఈ వివాహాన్ని జరిపించానని... కొత్త జంటను అందరూ ఆశీర్వదించాలని కోరారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos