తానా - ఉత్తర అమెరికా తెలుగు సంఘం తదుపరి అధ్యక్షుడిగా 2025 - 27 మధ్య కాలానికి వర్జీనియాకు చెందిన డాక్టర్ నరేన్ కొడాలి ఎన్నిక అయ్యారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో తానా సభ్యులు నరేన్ కొడాలి టీమ్‌కు విజయాన్ని అందించారు. ఈ క్రమంలో 2023 తానా ఎన్నికల్లో నరేన్ కొడాలి ప్యానెల్ విజయం సాధించిందని ఎన్నికల కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరించిన కనకం బాబు ఐనంపూడి ప్రకటించారు. తొలిసారిగా ఆన్ లైన్ ద్వారా ద్వారా జరిగిన ఎన్నికల్లో నరేన్ కొడాలికి 13,225 ఓట్లు రాగా ... ఆయన ప్రత్యర్థి సతీష్ వేమూరికి 10,362 ఓట్లు లభించాయి. 2023 - 25 కాలానికి నరేన్ కొడాలి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గా వ్యవహరించనున్నారు. కార్యదర్శిగా రాజా కనుపర్తి, కోశాధికారిగా భరత్ మద్దినేని, సంయుక్త కార్యదర్శిగా వెంకట్ కోగంటి, సంయుక్త కోశాధికారిగా సునీల్ పాంట్ర, కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ గా లోకేష్ నాయుడు కొణిదెల, కల్చరల్ సర్వీస్ కోఆర్డినేటర్ గా ఉమా కటికి, ఉమెన్ సర్వీస్ కోఆర్డినేటర్ గా సోహిని అయినాల, కౌన్సిలర్ ఎట్ లార్జ్ సతీష్ కొమ్మన, ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ గా ఠాగూర్ మలినేని, క్రీడల కోఆర్డినేటర్ గా నాగ పంచుమర్తి ఎన్నికైనట్లు కమిటీ ప్రకటించింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos