అవినీతి, లంచం కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదని సుప్రీంకోర్టు తాజాగా సంచలన తీర్పును వెల్లడించింది. గతంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఇవాళ కొట్టివేసింది. ప్రజా ప్రతినిధులు విచారణను ఎదుర్కోవాల్సిందేనని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. 1988లో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. లంచం కేసులో అభియోగాలపై విచారణ నుండి రక్షణ కోరరాదని స్పష్టం చేసింది.1998లో పీవీ నరసింహారావు, వర్సెస్ స్టేట్ కేసు తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. గత ఏడాది జార్ఖండ్ ఎమ్మెల్యే సీతా సోరేన్ కేసును విచారించింది. 2012లో రాజ్యసభ ఎన్నికల సమయంలో లంచం తీసుకొని ఓటు వేశారని సీతా సోరెన్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును విచారించి గత ఏడాది అక్టోబర్ 5న తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు.. తాజాగా వెల్లడించింది. చట్టసభ్యుల అవినీతి పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును దెబ్బతీస్తుందని అభిప్రాయపడింది. ప్రజా ప్రతినిధి లంచం తీసుకోవడం నేరమని.. లంచం తీసుకిని శాసన సభ లేదా పార్లమెంట్‌లో మాట్లాడటం, ఓటు వేయడం నేరపూరిత చర్య అని సుప్రీంకోర్టు పేర్కొ్ంది. శాసన విధులను నిర్వర్తించడానికి.. అవినీతి కేసుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలకు మినహాయింపులు అవసరం లేదని పేర్కొంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos