ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనుభవ లేమితో... అగ్నానంతో విధిస్తున్న పన్నుల భారం మోయలేక సాధారణ, మధ్యతరగతి కుటుంబాల వారు అవస్థల పాలు అవుతున్నారు. జగన్... భారీగా పెంచిన ఆస్తిపన్నుకు తోడు ఇళ్ల నుంచి సేకరిస్తున్న చెత్తకు సైతం యూజర్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో పట్టణ ప్రజలకు ఇవి మోయలేని భారంగా తయారయ్యాయి.  ప్రజలపై భారం పడకుండా ఘన వ్యర్థాల నిర్వహణలో అనేక రాష్ట్రాలు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాయి. కానీ... జగన్ ప్రభుత్వం అలాంటి దారుల్ని చూడకుండా పన్నులు వేస్తూ... ప్రజలను ఆర్థికంగా ఇరుకున పెడుతోంది. ఇళ్ల నుంచి చెత్త సేకరణకు వినియోగ రుసుముల వసూళ్లపై సొంత పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ఇతర ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఎంత వ్యతిరేకించినా వెనక్కి తగ్గేది లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది జగన్ సర్కారు. రుసుములు చెల్లించలేని పేదలను వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని బెదిరిస్తున్నారు. దుకాణాల ముందు చెత్త వేసి వ్యాపారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చెత్త సేకరిస్తున్నందుకు ప్రజల నుంచి రూ.30 నుంచి 120 వరకు, వ్యాపారుల నుంచి రూ.60 నుంచి కేటగిరినీ బట్టి రూ.5 వేల వరకు రుసుములు వసూలు చేస్తున్నారు అధికారులు. ఈ విధంగా ప్రజలు, వ్యాపారులపై ప్రభుత్వం ఏటా రూ.165 కోట్ల భారం వేస్తోంది. ఒక ప్రైవేటు సంస్థకు ఆర్థికంగా మేలు చేకూర్చేందుకే ప్రభుత్వం ఇళ్ల నుంచి చెత్త సేకరించే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ సంస్థ ద్వారా తొలి విడతగా 42 పుర, నగరపాలక సంస్థలకు 2,146 ఆటోలు పంపిణీ చేయించారు. ఇందుకోసం ఒక్కో ఆటోకి నెలకు రూ.62 వేల చొప్పున మొత్తం రూ.13.3 కోట్లు స్థానిక సంస్థలు చెల్లించాలన్నది ఒప్పందం. ప్రజల నుంచి వినియోగ రుసుములు వసూలు చేసినా చేయకపోయినా... ప్రైవేటు సంస్థకు ప్రతి నెలా డబ్బు చెల్లించాల్సిందే. పైనుంచి అధికారులు సచివాలయాల ఉద్యోగులకు లక్ష్యాలు విధించడంతో వాలంటీర్ల ద్వారా ప్రజలను, చిరు వ్యాపారులను భయపెట్టి వినియోగ రుసుములు చెల్లించాలని ఒత్తిడి పెంచుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పలువురు వృద్ధులకు ఇచ్చే పింఛన్ నుంచి వినియోగ రుసుముల బకాయిలను సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్లు మినహాయించారు. కడప కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు ఇచ్చే పింఛన్ల నుంచి వినియోగ రుసుములు మినహాయించి వారిని ఇబ్బంది పెట్టొద్దని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అధికారులకు విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది. గడువులోగా రుసుములు వసూలు చేయనందుకు కాకినాడలో ముగ్గురు కార్యదర్యులను సస్పెండ్ చేయడం దుమారం రేపింది. జగన్ ప్రభుత్వం 2021 అక్టోబరు 2న స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ – క్లాప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మొదటి విడతగా ప్రారంభించిన 42 నగరాలు, పట్టణాలకు తోడు ఈ జూన్ లో మరో 36 పట్టణ స్థానిక సంస్థల్లోనూ చెత్త సేకర ణకు ఈ-ఆటోలు ప్రారంభించారు. చెత్త సేకరణపై ఇళ్ల నుంచి వినియోగ రుసుముల వసూళ్లను అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కడప నగరపాలక సంస్థలో రుసుముల వసూళ్లపై వైసీపీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్డ్డి ఏడాది క్రితమే అభ్యంతరం చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఓల్డ్ పీఅండ్ టీ కాలనీ వాసులు మొదట నుంచీ చెత్త పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ విధంగా చెత్తపైన సైతం పన్ను వసూలు చేస్తుంటంతో... ఇలాంటి జగన్ ప్రభుత్వాన్ని మళ్లీ మేం ఎన్నుకోవాలా... మళ్లీ మేం ఇబ్బందుల్లో కూరుకుపోవాలా అని రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలు అధికారులను, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : పెన్షన్ల పంపిణీ..CM Chandrababu Pension Distribution @ Palnadu | NTR Bharosa | Amaravati Gala

తాజా వార్తలు

19-43-09-0109.jpg

స్మోక్ ఫ్రీ సిగరెట్ తయారీ యూనిట్ కు గుంటూరు, ప్రకాశం జిల్లాలు అనుకూలం.. ఫిలిప్ మోరిస్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రియా గోంట్కోవికోవాతో లోకేష్ భేటీ
2025-01-21 Time: 07:43:09

17-55-03-0103.jpg

ఏపీలో జడ్ఎఫ్ ఫాక్స్ కాన్ వాహన తయారీ యూనిట్ నెలకొల్పండి..! సిఇఓ ఐకీ డోర్ఫ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ
2025-01-21 Time: 05:55:03

17-52-33-0133.jpg

ఇక ఆ విషయంపై మాట్లాడొద్దు - జనసేన శ్రేణులకు హైకమాండ్ కీలక ఆదేశాలు..!
2025-01-21 Time: 05:52:33

16-43-36-0136.jpg

దావోస్ లో సిస్కో వైస్ చైర్మన్ ప్రాన్సిస్ కట్సౌదాస్ తో మంత్రి లోకేష్ భేటీ.. ఏపీలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని విజ్ఞప్తి..!
2025-01-21 Time: 04:43:36

16-41-00-0100.jpg

ఆంధ్రప్రదేశ్ లో డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయండి..! మాస్టర్ కార్డ్ ఫౌండర్ ప్రెసిడెంట్ రాజమన్నార్ తో మంత్రి లోకేష్ భేటీ
2025-01-21 Time: 04:41:00

Related Videos