అభిమానానికి హద్దు ఉంటుంది కానీ వీరాభిమానానికి హద్దులు ఉండవు. కాంగ్రెస్ పార్టీకి దేశంలో వీరాభిమానులు చాలా మందే ఉన్నారు. ఎన్నో ఏళ్ల పాటు ప్రజలు కలలు కన్న తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ అంటే తెలుగు ప్రజలకు చాలామందికి అభిమానమే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ వీరాభిమాని ఒకరు వినూత్నంగా ఆలోచించి వెరైటీగా ప్రచారం మొదలుపెట్టారు.
వరంగల్‌లోని కాజీపేటలో రాహుల్ గాంధీ ఫ్యామిలీ టీ పాయింట్ ఏర్పాటుచేయగా సోషల్ మీడియాలో ప్రస్తుతం అదికాస్త వైరల్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీనికి కారణం ఓ ఫ్లెక్సీ. సదరు ఫ్లెక్సీలో ‘టీ తాగితే మైండ్ ఫ్రెష్ అవుతుంది.. రాహుల్ గాంధీ గెలిస్తే దేశం ఫ్రెష్ అవుతుంది’ అని ట్యాగ్ లైన్ రాసి ఉంది. దీంతో క్రియేటివిటీ అదిరిందంటూ నెటిజన్‌లు కామెంట్ చేస్తున్నారు. టీని, రాహుల్ గాంధీ పేరును కలుపుతూ తయారు చేసిన స్లోగన్ అద్భుతంగా ఉందని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీపై దేశవ్యాప్తంగా మళ్లీ క్రేజ్ పెరుగుతోంది. ఇటీవల భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ దేశవ్యాప్తంగా పర్యటించారు. జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజ్‌ను తెచ్చిపెట్టింది.
గతంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కాలంలో చేసిన స్వీయ తప్పిదాలతో అధికారం కోల్పోయిన ఆ పార్టీకి తిరిగి జవజీవాలు నింపేందుకు రాహుల్ గాంధీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో స్ధానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఇప్పుడు రాహుల్ బాటలోనే సాధారణ ప్రజల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది డిసెంబర్ లో ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయి. ఇదే క్రమంలో గతంలో ఉన్న బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోటీని కాస్త ... కర్నాటక విజయం తర్వాత బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మార్చేసిన ఆ పార్టీ నేతలు.. ఇప్పుడు స్ధానికంగానూ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. కాగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా పలుచోట్ల టీ స్టాళ్లను సందర్శించారు. చాయ్ వాలాగా ప్రచారం చేసుకుంటున్న ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ టీ దుకాణాలు నడిపే వాళ్ల కష్టాలను రాహుల్ గాంధీ హైలెట్ చేశారు.
ప్రస్తుతం కాంగ్రెస్ వీరాభిమానులు రాహుల్ గాంధీ పేరుతో టీ స్టాళ్లు ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నారు. ఈ టీ వాలా ప్రచారం వెరైటీగా భలేగుంది అని సామాజిక మాధ్యమాల్లో పెద్దస్థాయిలో చర్చించుకుంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos