సుమారు నాలుగున్నరేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా ఉన్న మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు .. ఎన్నెన్నో మలుపులు తిరుగుతున్న క్రమంలో... ఇప్పుడు తాజాగా మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఈ కేసులో నిందితుల అరెస్టులు ... బెయిల్... విచారణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ ను సీబీఐ కోర్టు తిరస్కరించడం సంచలనంగా మారింది. వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తును జూన్ 30వ తేదీలోపు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేయాలని గతంలో సీబీఐకి సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మేరకు జూన్ 30 హైదరాబాద్ సీబీఐ కోర్టులో అదనపు ఛార్జిషీట్ దాఖలు చేసింది.
ఇందులో అవినాష్ రెడ్డిని ఏ-8 గా పేర్కొనగా... ఆ ఛార్జిషీట్ ను తాజాగా సీబీఐ కోర్టు తిరస్కరించిందని అంటున్నారు. ఈ ఛార్జిషీట్ ను ఎందుకు తిరస్కరించిందనే కారణంపై స్పష్టత రాలేదు. దీని వెనుక సాంకేతిక కారణాలు ఉన్నాయని... తప్పుల్ని సరిచేసి తిరిగి ఛార్జిషీట్ దాఖలు చేయాలని సీబీఐకి కోర్టు సూచించిందని సమాచారం. దీంతో ఛార్జిషీట్ లో దొర్లిన సాంకేతిక తప్పిదాల్ని సవరించిన సీబీఐ అధికారులు... అనంతరం కోర్టులో తిరిగి దాఖలు చేశారని తెలుస్తోంది. ఈ విషయాన్ని హైకోర్టులో దస్తగిరి పిటిషన్ విచారణ సందర్భంగా సీబీఐ అధికారులు వెల్లడించారు. దీంతో ఛార్జిషీట్ తిరస్కరణ అంశం బయటపడింది.
అయితే గతంలోనూ పలు ఛార్జిషీట్లు సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురైన సందర్భాలు ఉండటంతో ఈ వ్యవహారంపై హైకోర్టుకు తాజా అంశాన్ని సీబీఐ అప్ డేట్ చేసినట్లయింది. వివేకా కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తి చేసేందుకు సుప్రీంకోర్టు జూన్ 30 డెడ్ లైన్ పెట్టినందున... ఈ దర్యాప్తు పూర్తయిందా లేదా అన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. డెడ్ లైన్ ముగిసేరోజు సీబీఐ ఛార్జిషీట్ అయితే దాఖలు చేసింది. కానీ అది తుది ఛార్జిషీటా కాదా అన్న అంశంపై క్లారిటీ లేదు. అలాగే సుప్రీంకోర్టును సీబీఐ మరోసారి దర్యాప్తు గడువు పెంచమని కూడా కోరకపోవడంతో ఇప్పుడు ఈ కేసు ఉత్కంఠగా మారింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos