కన్నడ నటి రన్యారావు కేసులో భారీ ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. ఆమెపై డీఆర్‌ఐ అధికారులకు ఆమె భర్తే జతిన్‌ హుక్కేరి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.  పెళ్లైన రెండు నెలల నుంచే రన్యారావు తరచు విదేశాలకు వెళ్తోంది. ఆమె విదేశీ టూర్లతో నిత్యం గొడవలు జరిగేవి. ఈ క్రమంలో భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో  ఆమె భర్త జతిన్ హుక్కేరి.. రన్యారావుపై డీఆర్‌ఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రన్యారావు కదలికలపై నిఘా పెట్టిన డీఆర్‌ఐ అధికారులు.. ఆమె బంగారం స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు గుర్తించి అరెస్ట్‌ చేశారు.

రన్యారావు 15 రోజుల్లో నాలుగుసార్లు దుబాయ్‌కు వెళ్లడం, అదికూడా ప్రతిసారి సేమ్‌ డ్రెస్‌ ధరించడంతో అధికారులకు అనుమానమొచ్చింది. ఈ నెల 3మ అంటే మార్చి 3న ఆమెను బెంగళూరు ఎయిర్‌పోర్టులో తనిఖీ చేయగా 14 కిలోలకు పైగా బంగారంతో అడ్డంగా దొరికిపోయింది. దీంతో ఆమెను అరెస్టు చేసిన అధికారులు జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. ఇకపోతే రన్యా రావు సవతి తండ్రి డాక్టర్‌ కె.రామచంద్రారావు కర్ణాటక డీజీపీగా ఉన్నారు.  ఆమె సవతి తండ్రి ఓ పోలీస్ ఉన్నతాధికారి కావడంతో ఆయన ప్రమేయం గురించి కూడా విచారణ జరపాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. అవసరమైతే ఆయనను కూడా విచారణ చేయాలని, ఈ విషయంలో రామచంద్రరావు పాత్ర ఉందా లేదా అనేది తేల్చాలని ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి, అదనపు సీఎస్ గౌరవ్ గుప్తాకు బాధ్యతలు అప్పగించింది.

ఈ విషయంపై డీజీపీ స్పందిస్తూ రన్యాకు నాలుగు నెలలకిందటే పెళ్లి జరిగిందని, అప్పటినుంచి తనను కలవలేదని పేర్కొన్నారు. కూతురు, అల్లుడు చేసే పనుల గురించి తనకెటువంటి విషయాలు తెలియదన్నారు. ఈ క్రమంలో రన్యా భర్త ఎవరన్న వివరాలు బయటకు వచ్చాయి. రన్యా భర్త జతిన్‌ హుక్కేరి  ఆర్కిటెక్ట్‌. బెంగళూరులో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ పట్టా పొందాడు. తర్వాత లండన్‌లో డిస్‌రప్టివ్‌ మార్కెట్‌ ఇన్నొవేషన్‌ కోర్సు చదివాడు. మొదట్లో బెంగళూరులోని పలు రెస్టారెంట్లకు డిజైనర్‌గా పని చేశాడు. లండన్‌లోనూ ఆర్కిటెక్ట్‌గా సేవలందించాడు. WDA & DECODE LLC సంస్థను స్థాపించడంతోపాటు దానికి క్రియేటివ్‌ డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నాడు. క్రాఫ్ట్‌ కోడ్‌ కంపెనీకి ఫౌండర్‌ కూడా ఇతడే! రన్యారావును పెళ్లి చేసుకున్నాక తనతో కలిసి పలుమార్లు దుబాయ్‌ ట్రిప్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఎయిర్‌పోర్టులో బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ రన్యా దొరికిపోగా.. ఆమె ఇంటిని సైతం తనిఖీ చేశారు. ఈ సోదాలో రూ.2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.67 కోట్ల నగదు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇకపోతే రన్యా రావు.. కిశోర్‌ నమిత్‌ కపూర్‌ యాక్టింగ్‌ స్కూల్‌లో నటనపై శిక్షణ తీసుకుంది. మాణిక్య అనే కన్నడ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఇది ప్రభాస్‌ మిర్చి మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. పటాస్‌ కన్నడ రీమేక్‌ పటాకిలో హీరోయిన్‌గా నటించింది. తమిళంలో వాఘా మూవీ చేసింది. ఆమె ఎనిమిదేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటోంది. ఇప్పుడు బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడటంతో ఆమె పేరు తెరపైకి వచ్చింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos