చెన్నై లోని కొకైన్ రాకెట్‌పై నిర్వహించిన సోదాల్లో భాగంగా డ్రగ్స్ ట్రాఫికింగ్ కేసులో నటుడు శ్రీరామ్‌ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి పోలీసులు ఆయనను చెన్నై లోని ఎగ్మోర్ కోర్టులో హాజరుపరిచారు. ఎనిమిది గంటల పోలీసుల విచారణ అంశాలతో పాటు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి నటుడు శ్రీరామ్‌కు జూలై 7 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పును వెలువరించారు. ఇదే కేసులో తమిళనాడులోని సేలం జిల్లాలో ఉన్న సంకగిరికి చెందిన ప్రదీప్ కుమార్, ఘనా దేశానికి చెందిన పౌరుడు జాన్ కొకైన్ విక్రయిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. అయితే, విచారణలో ప్రదీప్, నైజీరియా పౌరుడు జెర్రిక్, జాన్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా ఒప్పుకున్నాడు. కాగా, ప్రదీప్  చెన్నైలో బహుళ వ్యక్తులకు డ్రగ్స్ అమ్మినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అందులో చెన్నైకి చెందిన మాజీ ఏఐఏడీఎంకే నాయకుడు ప్రసాద్ కూడా ఉన్నారు. జాన్, సినీ పరిశ్రమలోని పలువురు నటీనటులకు నార్కోటిక్స్ సరఫరా చేసినట్లు వెల్లడించాడు. ఇదే లిస్ట్‌లో శ్రీరామ్ పేరు కూడా ఉంది. జూన్ 23న నుంగంబాక్కం నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ పోలీసులు శ్రీరామ్‌ను విచారణకు పిలిచారు. రక్త పరీక్షలో కొకైన్ ఆనవాళ్లు ఉన్నట్లుగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. పూర్తి నివేదికల ఆధారంగా పోలీసులు శ్రీరామ్‌ను అరెస్టు చేసి సోమవారం రాత్రి 11:30 గంటలకు జడ్జి దయాళన్ ముందు హాజరుపరచగా.. జులై 7 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌ విధించారు. 'రోజాపూలు' సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు పొందారు శ్రీరామ్‌. 'ఒకరికి ఒకరు', 'ఆడవారి మాటలకు అర్థాలు వేరులే' 'మస్కా', 'రామ రామ కృష్ణ కృష్ణ', 'కందిరీగ', 'భలే మంచిరోజు' వంటి చిత్రాల్లో నటించారు. అలాగే 'హరికథ' వెబ్‌సిరీస్‌లో కీలక పాత్రలు పోషించారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos