నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సహచరుడు బుచ్ విల్‌మోర్‌లు 9 నెలల నిరీక్షణ తరువాత సురక్షితంగా భూమికి చేరుకున్నారు. ఈ ఇద్దరు వ్యోమగాములను అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి తీసుకుని వచ్చేందుకు నాసా- స్పేస్‌ఎక్స్‌ సంయుక్తంగా క్రూ-10 మిషన్ చేపట్టి విజయవంతం అయ్యారు. ఇంటర్నేషనల్‌  స్పేస్‌ స్టేషన్‌ నుంచి మంగళవారం తిరుగుప్రయాణమైన సునీతా విలియమ్స్.. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27కి ఫ్లోరిడా తీరంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యారు.

సునీత విలియమ్స్.. దివి నుంచి భువికి సురక్షితంగా చేరుకోవడంతో దేశ వ్యాప్యంగా ఆమెకు స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి... సునీత విలియమ్స్ కి స్వాగతం పలుకుతూ.. ఇద్దరు వ్యోమగామిలకు భగతంతుడు మరింత శక్తి ఇవ్వాలని.. ఇది నిజమైన బ్లాక్ బస్టర్ అని కొనియాడుతూ ట్వీట్ చేశారు. సుదీర్ఘ నిరీక్షణ తరువాత.. దివి నుంచి భువికి చేరిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లకు స్వాగతం. ఇది ప్రపంచ చరిత్రలోనే చారిత్రక ఘట్టం. ఎనిమిది రోజుల్లో తిరిగిరావాలని స్పేస్ స్టేషన్‌కి వెళ్లి 286 రోజులకు తర్వాత భూమికి చేరుకున్నారు. ఈ 286 రోజుల్లో.. 4577 సార్లు భూమి చుట్టూ తిరిగారు కానీ ఆశ్చర్యకరమైన రీతిలో భూమిని చేరుకోలేకపోయారు. వీరి ప్రయాణం ఒక థ్రిల్లర్ అడ్వెంచర్ మూవీని తలపిస్తోంది.. ఇదో గొప్ప సాహస యాత్ర.. అసలుసిసలు బ్లాక్ బస్టర్.. వీరికి సాటే లేదు.. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు గొప్ప ధైర్యవంతులు’ అని కొనియాడారు మెగాస్టార్ చిరంజీవి.

మెగాస్టార్ చిరంజీవి అన్నట్టుగా.. ఈ 286 రోజులు సాహస యాత్ర నిజంగానే ఒక థ్రిల్లర్ అడ్వెంచర్. ఈ సాహస యాత్రలో వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులు, ధైర్య సాహసాలపై సినిమా వచ్చినా రావచ్చు. మెగాస్టార్ అన్నట్టుగా నిజమైన బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశమూ లేకపోలేదని సీనియర్ సినీ పండితులు అంటున్నారు. ఇప్పటికే అంతరిక్షం నేపథ్యంలో హాలీవుడ్‌, బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు సునీతా విలియమ్స్ సాహసయాత్రపై మన టాలీవుడ్ అగ్ర దర్శకులు గురిపెట్టి బ్లాక్ బస్టర్ కొడతారేమో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos