సినిమా : అక్కినేని ఇంట మరోసారి పెండ్లి బాజాలు మోగనున్నాయా..! సమంతతో విడాకులు తీసుకున్న తరువాత నాగచైతన్య మరో పెండ్లికి సిద్ధమయ్యాడా..? ఓ హీరోయిన్‌తో చైతూ ప్రేమలో మునిగిపోయాడని, వారిద్దరి మధ్య గత కొంత కాలంగా జరుగుతున్న ప్రచారానికి నేటితో తెరపడనుందా..? అంటే అవుననే సినిమా నెట్టింట ప్రచారం జరుగుతున్నది. నటి శోభితా ధూళిపాళ్లతో నాగచైతన్య ఎంగేజ్‌మెంట్‌ జరుగనుందనీ.. అది కూడా గురువారమేనంటూ ఓ వార్త వైరలవుతున్నది. కొద్దిమంది సమక్షంలో ఇరువురు ఉంగరాలు మార్చుకోనున్నారని, త్వరలోనే హీరో నాగార్జున ఓ ప్రకట చేయనున్నాడని కొన్ని ప్రధాన వెబ్‌సైట్లు కూడా ప్రచురించాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయమే తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇటు అక్కినేని ఫ్యామిలీ కానీ, అటు శోభిత కుటుంబం ఈ విషయమై ఎలాంటి ప్రకటనా చేయకపోవడమే..!

ఇదిలాఉంటే.. 2017లో నటి సమంతను అక్కినేని నాగచైతన్య ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో కొంతకాలం దూరంగా ఉన్నారు. అనంతరం 2021 అక్టోబర్‌లో విడిపోతున్నట్టుగా ప్రకటించారు. అప్పటినుంచే చైతూ-శోభిత జంటపై రూమర్స్‌ వచ్చాయ్‌. ఇద్దరు లవ్‌లో పడ్డారని, డేటింగ్‌ చేస్తున్నట్టు కూడా చాలారోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే అది నిజమే అన్నట్టుగా ఇద్దరు కలిసి ఉన్న వెకేషన్‌ పిక్స్‌ బయటికి కూడా వచ్చాయి. ఇప్పుడు ఏకంగా నిశ్చితార్థం కన్ఫ్మామ్‌ అవడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ఇక శోభితా ధూళిపాళ్ల 1993, మే 31న వేణుగోపాల్‌ రావు, శాంత దంపతులకు జన్మించారు. తెనాలి స్వస్థలం. విశాఖపట్నంలో లిటిల్‌ ఏంజెల్స్‌ స్కూల్‌, విశాఖ వ్యాలీ స్కూల్‌లో చదివింది. ముంబై యూనివర్సిటీ, హెచ్‌.ఆర్‌ కాలేజ్‌లో కామర్స్‌, ఎకనామిక్స్‌ పూర్తి చేసింది. సంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడిలో శిక్షణ తీసుకుంది. 2013లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ విన్నర్‌గా నిలిచారు. 2016లో సినీ రంగంలోకి ప్రవేశించారు. 2013 మిస్‌ ఎర్త్‌ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత సినీరంగంలోకి అడుగుపెట్టారు. 2016లో తొలిసారి నటించారు. అనురాగ్‌ కశ్యప్‌ డైరెక్షన్‌లో 'రామన్‌ రాఘవ్‌’ చిత్రం చేశారు. 'మేడ్‌ ఇన్‌ హెవెన్‌’ సిరీస్‌లో కీలక పాత్ర పోషించారు. 2018లో తెలుగులో వచ్చిన 'గూఢాచారి', 2022లో వచ్చిన 'మేజర్‌' సినిమాలతో హిట్‌ అందుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌, బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లోనూ అవకాశాలు అందుకుంటున్నారు శోభితా ధూళిపాళ్ల.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos