అక్కినేని ఇంట త్వరలోనే పెళ్లి బాజా మోగనుంది. సమంతతో విడాకులు తీసుకున్న నాగ చైతన్య రెండో పెళ్లికి రెడీ అయ్యారు. చాన్నాళ్లుగా మోడల్, హీరోయిన్ శోభిత ధూళిపాళతో చైతూ రిలేషన్‌లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈరోజు వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ కూడా జరుగుతుందంటూ నిన్నటి నుంచి రూమర్స్ వచ్చాయి. తాజాగా ఇది నిజమేనని క్లారిటీ ఇచ్చేశారు నాగార్జున. శోభిత ధూళిపాళ-నాగ చైతన్య ఎంగేజ్‌మెంట్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

నా కుమారుడు నాగ చైతన్యకి శోభిత ధూళిపాళతో ఈ రోజు ఉదయం 9 గంటల 42 నిమిషాలకి నిశ్చితార్థం జరిగింది. అక్కినేని కుటుంబంలోకి శోభితను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కొత్త జంటకి కంగ్రాట్యూలేషన్స్. జీవితాంతం వీరు ఇలాగే ప్రేమగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. గాడ్ బ్లెస్. 8.8.8... అనంతమైన ప్రేమకి శుభారంభం అంటూ నాగార్జున పోస్టు పెట్టారు.

ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ చైతూ-శోభితలకి శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. అయితే 888‌కి అర్థమేంటో తెలియక కొంతమంది నెటిజన్లు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అయితే ఒక 8 ఈరోజు తారీఖు కాగా మరొక 8 నెల.. కానీ మూడో 8కి అర్థమేంటో అంటూ చర్చించుకుంటున్నారు.

Related Videos