పవన్ కల్యాణ్ ను కలిసేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ ను కలిసేందుకు అనుమతి కావాలంటూ ఆయన వ్యక్తిగత సిబ్బందిని కోరారని, అయితే ఇంకా అనుమతి మాత్రం రాలేదని తెలుస్తోంది. అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేసిన వెంటనే... పెద్దగా పట్టించుకోని మెగా కుటుంబం .. ఆ తర్వాత కొంత సమయానికి ఆయనను పరామర్శించింది. మెగాస్టార్ చిరంజీవితో పాటు నాగబాబు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో పవన్ ఒక ట్వీట్ చేశారు. అయితే అది అల్లు అర్జున్ ను ఉద్దేశించి కాకపోయినా.. అప్పటివరకు రెండు కుటుంబాల మధ్య జరిగిన పరిణామాలతో.. అది అల్లు అర్జున్ కోసం చేసిన ట్వీట్ అని అంతా భావించారు. అదే రోజు పవన్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చారు. అప్పటికే చిరంజీవితో పాటు నాగబాబు అల్లు అర్జున్ ను పరామర్శించిన నేపథ్యంలో.. పవన్ కూడా అదే పని మీద వస్తున్నారని అంతా భావించారు. కానీ అటువంటిదేమీ జరగలేదు. దీంతో పవన్ ఇంకా అల్లు అర్జున్ విషయంలో ఇప్పటికీ మరో ఆలోచనలో ఉన్నారని ఈ పరిణామాల ద్వారా తెలియ వచ్చింది.
ఈ క్రమంలో అల్లు అర్జున్ స్వయంగా అమరావతికి వెళ్లి పవన్ ను కలుస్తారని ప్రచారం జరిగింది. ఈ విషయంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ద్వారా అల్లు అర్జున్ ప్రయత్నించారన్నది ఒక వార్త. కానీ పవన్ కళ్యాణ్ నుంచి ఎటువంటి సంకేతం రాకపోవడంతో.. అల్లు అర్జున్ వెయిట్ చేస్తున్నట్లు సమాచారం. అయితే డిప్యూటీ సీఎం కావడంతో పవన్ కళ్యాణ్ తన అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారా.. లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది.
వాస్తవానికి పవన్ కల్యాణ్ కు ఈ ఏడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు జీవన్మరణ సమస్యల్లాంటివి. ఈ పరిస్థితిలో సినిమా పరిశ్రమ మొత్తం పవన్ కు అండగా నిలిచింది. కానీ అల్లు అర్జున్ మాత్రం నంద్యాల నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి ప్రచారం చేసేందుకు స్వయంగా నంద్యాల వెళ్లారు. ఈ సంఘటన పవన్ కల్యాణ్ ను తీవ్రంగా బాధించింది. ఆ సమయంలో మెగా కుటుంబానికి, అల్లు కుటుంబానికి దూరం బాగా పెరిగింది. ఇప్పుడు అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యాక ఆ దూరం తగ్గుతుందని భావించారు కానీ... అటువంటిది ఏమి కనిపించడం లేదని సినీ, రాజకీయ వర్గాల వారు చెబుతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos