నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడైన తారక రామారావు సినిమాలలోకి తెరంగేట్రం చేయబోతున్నాడు. వై వి ఎస్ చౌదరి తారక రామారావు కాంబో తో నేడు కొత్త సినిమా ప్రారంభం అయింది. ఈ రోజు దీనికి సంబంధించి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. నందమూరి హరికృష్ణ మనవడు ఎన్టీఆర్ సినీ ప్రయాణం సక్సెస్ కావాలని ఆయన ఆకాంక్షించారు. చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెడుతూ తారక రామారావుకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఎన్టీఆర్ గొప్ప విజయాలు అందుకోవాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు. తారకరామారావు ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన చంద్రబాబు, తను అన్ని విషయాలలోనూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్టు పోస్ట్ చేశారు.

మరోవైపు ఈ రోజు పూజా కార్యక్రమానికి నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, గారపాటి లోకేశ్వ‌రి, ఎన్టీఆర్ ముగ్గురు కుమార్తెలు హాజ‌ర‌య్యారు. నారా భువ‌నేశ్వ‌రి హీరో హీరోయిన్ల‌పై క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించి, అభినందించారు. త‌న తండ్రి సీనియ‌ర్ ఎన్‌టీఆర్ న‌ట‌న‌లో ఎంత కీర్తి తెచ్చుకున్నారో తార‌క రామారావు కూడా అలానే ఎద‌గాల‌ని తాను ఆకాంక్షిస్తున్నట్టు వెల్లడించారు. మరోవైపు హీరోగా ఎంట్రీ ఇస్తున్న తారకరామారావు కూడా తనముత్తాత ఎన్టీఆర్ ను స్మరించుకున్నారు. ముత్తాత ఎన్టీఆర్, తాత హరికృష్ణ, నాన్న జానకి రాముల ఆశీస్సులు ఎప్పుడూ తనకు ఉంటాయని నమ్ముతున్నానని, ఈ రోజు తమ కుటుంబం అంతా తనను ప్రోత్సహించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ప్రేక్షకుల ప్రేమాభిమానాలు తనను ముందుకు నడిపిస్తాయని నమ్ముతున్నానని తారక రామారావు పేర్కొన్నారు.

మొత్తానికి ఎన్టీఆర్ కు చంద్రబాబు కూడా శుభాకాంక్షలు తెలిపి, సినిమాలలో రాణించాలని ఆకాంక్షించారు. తాతకు తగ్గ మనవడిగా రాణించాలని కుటుంబం అంతా తారక రామారావును ఆశీర్వదిస్తున్నారు. అయితే తారక రామారావు సినీ ఎంట్రీ పట్ల తారక్ మాత్రం ఇంకా ఏమీ స్పందించలేదు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Take Oath As A TDP National Working President | CM Chandrababu | AG

తాజా వార్తలు

15-49-17-0617.jpg

మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం.. ఆర్టీజీఎస్ పై సమీక్షలో అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
2026-06-22 Time: 03:49:17

15-31-26-0626.jpg

ప్రజా ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టులు.. 4 అంశాలపై ప్రోగ్రెస్ రిపోర్టులను విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు
2026-06-22 Time: 03:31:26

17-02-16-0616.jpg

అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు.. చిన్నారులతో కలిసి రాగి జావ తీసుకున్న చంద్రబాబు
2026-06-20 Time: 05:02:16

14-06-28-0628.jpg

90వ రోజు ప్రజాదర్బార్.. వివిధ సమస్యలపై ప్రజల  వినతుల స్వీకరణ.. అన్నివిధాల అండగా ఉంటానట్టు  మంత్రి లోకేష్ హామీ
2026-06-16 Time: 02:06:28

14-04-35-0635.jpg

సెమీకండక్టర్ల తయారీకి ఏపీ బెస్ట్ డెస్టినేషన్.. సింగపూర్‌లో సెమీకండక్టర్లపై సెమీకాన్ ఎకోసిస్టమ్ సదస్సులో సీఎం చంద్రబాబు
2026-06-16 Time: 02:04:35

Related Videos