ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాపులారిటీ, స్టార్ డమ్ రోజురోజుకీ అందనంత ఎత్తుకి పెరుగుతోంది. 'పుష్ప' ఫ్రాంచైజీ తర్వాత అల్లు అర్జున్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. ఒక్క 'పుష్ప' మూవీతోనే నేషనల్ అవార్డుతో పాటు ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన బన్నీ మరోసారి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఏకంగా హాలీవుడ్ ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీపై ఆయన ఫోటోను ముద్రించడం ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. 

హాలీవుడ్ ప్రముఖ మ్యాగజైన్ 'ది హాలీవుడ్ రిపోర్టర్' అనే పేరుతో ఇప్పుడు ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. దీని ఫస్ట్ కాపీ కవర్ పేజీ అల్లు అర్జున్ ఫోటోతో రిలీజ్ అవ్వడం విశేషం. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫోటోషూట్ కూడా కంప్లీట్ కాగా, సోషల్ మీడియాలో ఓ బీటీఎస్ ప్రోమో వీడియోను వదిలారు. అందులో అల్లు అర్జున్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. "బలం, ఆత్మ విశ్వాసం నన్ను నటుడిగా ఈ స్థాయిలో నిలబెట్టాయి. అయితే నేను ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం, సామాన్యుడిలాగా వినయంగా ఉండడం అనే విషయాలను నేర్చుకున్నాను. ఇక సినిమాల వల్ల ఎన్నో విషయాలను నేర్చుకుంటున్నాను" అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.

 అంతే కాదు ఒక్క హిందీ డైలాగ్ కూడా చెప్పకుండానే నార్త్ ఆడియన్స్ మనసును దోచుకున్న అల్లు అర్జున్, ఇంత పెద్ద స్టార్ అయినప్పటికీ తనకు తాను 5.5 రేటింగ్ మాత్రమే ఇచ్చుకున్నాడు. మరి అల్లు అర్జున్ ఇలా చేయడానికి గల కారణం ఏంటో తెలియాలంటే 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' ఫస్ట్ కాపీని చదవాల్సిందేనని టాలీవుడ్ సినీ విశ్లేషకులు అంటున్నారు. 

ఇక 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' కవర్ పేజీపై అల్లు అర్జున్ ఫోటో ప్రింట్ అయ్యిందన్న విషయం తెలిసిన బన్నీ అభిమానులు తెగ సంతోష పడుతున్నారు. అంతేకాకుండా తమ అభిమాన నటుడు ఉన్న మ్యాగజైన్ ఫోటో, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ సందడి చేస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos