సినిమా టికెట్ల పెంపు పైన ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో తెలుగు సినీ పరిశ్రమ సమస్యలు. టికెట్ రేట్లపై ఏపీ ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించనుంది. ఏపీలో షూటింగ్ నిర్వహించే సినిమాలకు సంబంధించి టికెట్ రేట్ల పెంపు..అదే విధంగా హై బడ్జెట్ సినిమాలకు రేట్ల పెంపుపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించి ముందుగా హోం శాఖ నేతృత్వంలో ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు. ఈ వరుస భేటీల తరువాత సినిమా టికెట్ల రేట్లు పెంపు పైన ఒక విధాన పరమైన నిర్ణయం తీసుకోనున్నారు.

ఏపీలో సినిమా టికెట్ల పెంపు విధానం పైన త్వరలోనే నిర్ణయం ఉంటుందని మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు. సినిమా అంశాల పైన ముందుగా సినిమాటోగ్రఫీ, హోంశాఖ నేతృత్వంలో సమావేశం ఉంటుందని చెప్పారు. సినిమా టికెట్ రేట్లపై ప్రధానంగా చర్చ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఏపీ లో షూటింగ్ నిర్వహించే సినిమాలకు..సంబంధించి టికెట్ రేట్ల పెంపు..అదేవిధంగా హై బడ్జెట్ సినిమాలకు రేట్ల పెంపు పై చర్చించి.. ప్రతిపాదనలు సిద్దం చేస్తామని వివరించారు. ఈ సమావేశం తర్వాత సినీ పరిశ్రమ ప్రముఖులతో కీలక సమావేశం ఉంటుందని చెప్పారు. దీనికి సంబంధించి త్వరలో తేదీల ప్రకటన ఉంటుందని వెల్లడించారు.

కాగా, జనవరి 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు ఆవకాయ అమరావతి ఫెస్టివల్ నిర్వహణకు ప్రభుత్వం సిద్దమైంది. టూరిజం ప్రమోషన్ లో భాగంగా ఆవకాయ అమరావతి ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. విజయవాడ పున్నమి ఘాట్ లో ఈ ఫెస్టివల్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా టూరిజంపై వర్క్ షాప్స్ ఉండనున్నాయి. ఇక.. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఏపీలో గతంలో జరిగిన పెట్టుబడుల సదస్సులు.. ఒప్పందాల పైన చేసిన వ్యాఖ్యలపై మంత్రి దుర్గేశ్ స్పందించారు. కేసీఆర్ ఏదో విమర్శలు కోసం మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ అధికారంలో ఉన్నపుడు ఎంఓయూ లు గ్రౌండ్ అవ్వని పరిస్థితి వచ్చిందేమోనని , ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఈ పరిస్థితి లేదని చెప్పారు. కేసీఆర్ ఈ విషయం గుర్తు పెట్టుకోవాలని మంత్రి సూచించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos