నందమూరి కుటుంబంలో విభేదాలున్నాయనే సంగతి తెలిసిందే. కొంతకాలం బాగుంటారు.. మరికొంతకాలం బాగుండరు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ ఒక జట్టుగా ఉన్నారు. బంధువుల వేడుకలు జరిగినా ఇద్దరూ సంయుక్తంగానే హాజరవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను నందమూరి కుటుంబ సభ్యుల్లో కొందరు దూరం పెట్టారు. వారిలో బాలకృష్ణ ఒకరు. తరుచుగా పరోక్షంగా తారక్ పై ఆయన వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. మరికొన్ని సందర్భాల్లో ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తుంటారు. దీంతో తారక్ ఎవరితో కలవకుండా తన సినిమాలు తాను చేసుకుంటూ వాటిపైనే ఎక్కువ దృష్టిసారించారు. తాజాగా  కాజల్ అగర్వాల్ నటించి సత్యభామ చిత్రం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరగ్గా దానికి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. షరా మాములుగానే సినిమా గురించి, కాజల్ గురించి మాట్లాడిన తర్వాత బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. నందమూరి తారకరామారావు వారసులు అంటే ఆయన పేరు చెప్పుకోవడం కాదని, ఆయన నటించిన సినిమాల గురించి చెప్పుకోవడం కాదన్నారు. ఆయన చూపిన బాటలోనే పయనిస్తున్నామా.. లేదా అనేది ముఖ్యమని వ్యాఖ్యానించారు. జూనియర్ ఎన్టీఆర్ కు, బాలయ్యకు కొన్నాళ్ల నుంచి పడటంలేదు. తారక్ బహిరంగంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోయినప్పటికీ బాలకృష్ణ మాత్రం పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు ప్రధానంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ టీడీపీ పట్ల, చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బాలకృష్ణ గురించి చేసిన వ్యాఖ్యలు  పార్టీ శ్రేణులను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. వారిని తారక్ కావాలనుకుంటే నియంత్రించగలడని, కానీ అటువంటిదేమీ చేయకుండా సైలెంట్ గా ఉండటంతో టీడీపీ శ్రేణులు కూడా తారక్ ను లక్ష్యంగా ఎంచుకున్నాయి. పార్టీ సమావేశాల్లో, సభల్లో ఎక్కడా జూనియర్ ఎన్టీఆర్ ఫొటో కూడా కనిపించడం లేదు. మరి వీరిమధ్య విభేదాలు ఎప్పటికి చల్లారతాయో చూడాలి మరి.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos