దేశ వ్యాప్తంగా  పుష్ప 2 సృష్టిస్తున్న సంచలనాలు అందరికీ తెలిసిందే. భారత్ లో ఇప్పటివరకు ఇంకెవ్వరూ సాధించని, అందుకోని రేర్ ఫీట్స్, రికార్డుల్ని పుష్ప 2 క్రియేట్ చేస్తోంది. రెండున్నర రోజుల్లోనే 500 కోట్లు, మూడు రోజుల్లోనే 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించే రికార్డును... భవిష్యత్తులో ఇక ఏ చిత్రం బద్దలు కొడుతుందోనని మాట్లాడుకుంటున్నారు. ఆదివారం ఒక్క నార్త్ ఏరియాలోనే అదిరిపోయే కలెక్షన్లు వచ్చాయని తెలుస్తోంది. బాలీవుడ్ చరిత్రలో కనివినీ ఎరుగని నంబర్ వచ్చిందని అంటున్నారు.

మరో నాలుగు రోజుల్లో ఈ మూవీ 800 కోట్ల మార్క్ దాటుతుందని.. మరి ఈ నాలుగు రోజుల లెక్కల్ని మైత్రీ మూవీస్ ఎప్పుడు ప్రకటిస్తుందా అని బన్నీ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూడబోతున్నారు. అయితే బన్నీ సాధించిన ఈ విజయాలకు టాలీవుడ్ ఇంకా మౌనంగానే ఉంటూ... టాలీవుడ్ టాప్ హీరోలెవ్వరూ కూడా ఇంతవరకు పుష్ప 2 మీద స్పందించని నేపథ్యంలో... ఆశ్చర్యకరంగా బిగ్ బీ అమితాబ్ తాజాగా బన్నీ గురించి గొప్పగా మాట్లాడేశారు. పుష్ప 2 ప్రమోషన్స్‌లో భాగంగా ముంబైకి వెళ్లినప్పుడు అక్కడ అమితాబ్ గురించి బన్నీ మాట్లాడుతూ అమితాబ్ ఓ లెజెండ్ అని, ఆయనే అందరికీ ఇన్ స్పిరేషన్ అని, ఆయన ఇంకా ఈ వయసులోనూ అంత అద్భుతంగా పని చేస్తూ, నటిస్తూ అందరినీ మెప్పిస్తున్నారంటూ అమితాబ్ గురించి బన్నీ చాలా గొప్పగా మాట్లాడాడు.

ఈ మాటలు ఇప్పుడు బిగ్ బీ చెంతకు చేరడంతో ఆయన  స్పందించారు. అల్లు అర్జున్ గారు.. మీ మాటలు మా హృదయాన్ని తాకాయి.. నా అర్హత, నా స్థాయిని మించి మీరు పొగిడేస్తున్నారనిపించింది.. మీ పనితనం, మీ టాలెంట్‌కు మేమంతా మీ అభిమానులం.. మీరు ఇంకా మాా అందరినీ ఇన్ స్పైర్ చేస్తూనే ఉండాలి.. మీరు ఇలానే విజయాలు సాధిస్తూ ఉండాలని ఆ దేవుడ్ని నేను ప్రార్థిస్తాను అని ట్వీట్ వేశారు.

దీనిపై తాాజాగా బన్నీ ట్వీట్ వేస్తూ అమితాబ్‌ ఇంప్రెసివ్ అయ్యేలా రిప్లై ఇచ్చారు. అమితాబ్ గారు.. మీరు మా సూపర్ హీరో.. మీ నుంచి నా గురించి ఇలాంటి మాటలు వినడం ఆనందంగా ఉంది.. ఓ వింత అనుభూతిలా ఉంది.. మీరు మనస్పూర్తిగా ఇచ్చిన కాంప్లిమెంట్స్‌కు థాంక్స్.. మీ ఒదిగి ఉండే తత్వానికి గులాం అయ్యా అన్నట్టుగా బన్నీ రిప్లై ఇచ్చాడు. మొత్తం మీద బన్నీ ని అభినందిస్తూ బిగ్ బీ అమితాబ్ గొప్పగా ట్వీట్ చేయడాన్ని బన్నీ అభిమానులు తెగ ఖుషీ ఖుషీగా చెప్పుకుంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos